మనలో చాలా మంది నడుం నొప్పితో (Back Pain) బాధపడుతూ ఉంటారు. కరోనా తర్వాత చాలా మంది వర్క్ ఫ్రం హోం కారణంగా వెన్నునొప్పి (Back Pain) వస్తోందని డాక్టర్లను సంప్రదిస్తున్నారని తేలింది. 90 శాతం మంది ఏదో ఒక సమయంలో నడుము నొప్పితో (Back Pain) బాధపడుతున్నారట. అయితే, నడుం నొప్పితో బాధపడే వారిలో ఎక్కువ మంది పెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకొని సరిపెట్టుకుంటున్నారట. కొన్ని సందర్భాల్లో ఈ నొప్పి దానంతట అదే తగ్గిపోతుందని తేలింది.
1. సాధారణ నడుం నొప్పి సమస్య ఉంటే పర్వాలేదని, కానీ వెన్ను పాములో సమస్య ఉంటే మాత్రం అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
2. ఇలాంటి నొప్పిని నిర్లక్ష్యం చేస్తే కాళ్లు చచ్చుబడిపోవడం లాంటి భయంకరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
3. కండరాలకు సంబంధించిన సాధారణ సమస్య నుంచి మూత్ర పిండాల్లో రాళ్లు పడటం వంటి సమస్యలకు నడుం నొప్పి కారణం అవుతుందని సూచిస్తున్నారు.
4. చాలా మందిలో వెన్నుపాములో ఇబ్బందుల వల్ల నడుం నొప్పి వస్తుంటుంది. అయితే, డిస్క్ సమస్యల వల్ల వచ్చే నడుం నొప్పిని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు.
5. చాలా సందర్భాల్లో నడుం నొప్పి ఉన్నా వెన్నుపాముతో ఎలాంటి సంబంధం ఉండదు. నొప్పి ఎలాంటిదైనా నడుము విషయంలో అశ్రద్ధ పనికి రాదని నిపుణులు సూచిస్తున్నారు.
6. నొప్పి లక్షణాన్ని బట్టి అది ఏ అవయవానికి సంబంధించిందో తెలుసుకోవాలి. కొన్ని సింపుల్ టెక్నిక్స్ ద్వారా బ్యాక్ పెయిన్ ను దూరం చేసుకోవచ్చు.
7. తరచూ నడుం నొప్పితో బాధపడే వారు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా లిమిటెడ్ గా ఫుడ్ తీసుకోవడాన్ని ప్రిఫర్ చేయాలి.
8. రోజులో కాస్త సమయాన్ని యోగా, వ్యాయామం, స్పోర్ట్స్, డ్యాన్స్ లాంటి వాటిని కేటాయించాలి. ముఖ్యంగా ఎక్కువ సమయం కూర్చొని ఉండరాదు. నిలబడినప్పుడు సపోర్ట్ తీసుకుంటూ ఉండాలి. బరువులు ఎత్తేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి.
Walnuts: వాల్ నట్స్ తో ఆ సమస్యలు దూరం
పోషక విలువలున్న ఆహార పదార్థాల్లో వాల్ నట్స్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఒక ఔన్సు వాల్ నట్ లో 4 గ్రాముల ప్రొటీన్, 2 గ్రాముల ప్రొటీన్, 2 గ్రాముల ఫైబర్, కార్బో హైడ్రేట్లు, మాంగనీస్, మెగ్నీషియం, జింక్, సెలీనియం, పాస్పరస్, విటమిన్ బీ, ఈ తో పాటు కొవ్వు పదార్థాలు ఉంటాయి. దాంతో పాటు వాల్ నట్స్ తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లభ్యమవుతాయి. శరీరానికి మేలు చేసే ఒమేగా3 కొవ్వులు లభిస్తాయి.
1. చిగుళ్ల పటిష్టతకు వాల్ నట్స్ ఉపకరిస్తాయి. వాల్ నట్స్ లోని కొవ్వు ఆమ్లాలు మనకు చాలా రకాలుగా బెనిఫిట్స్ అందిస్తాయి. ముఖ్యంగా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు ఇవి దోహదపడతాయి.
2. వాల్ నట్స్ రోజూ తీసుకోవడం వల్ల అల్జీమర్స్ లాంటి బ్రెయిన్ సంబంధ జబ్బులు రాకుండా అరికట్టవచ్చు.
3. వాల్ నట్స్ లో ఉండే ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్.. నోట్లో చిగుళ్ల సమస్యలను దూరం చేస్తాయి. వాల్ నట్స్ లోని గుణాలు మెదడు పనితీరు మెరుగుపరుస్తాయి.
4. డిప్రెషన్ సమస్యతో బాధపడుతున్న వారు వాల్ నట్స్ తీసుకుంటే నిరాశ తగ్గి ఉత్సాహంగా ఉండగలుగుతారు. బాదం, పిస్తాతో పాటు వివిధ రకాల నట్స్, బెర్రీల కంటే వాల్ నట్స్ లో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
5. వాల్ నట్స్ లోని పోషకాలు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీర్ణక్రియ, జీర్ణ శక్తి పెరుగుతాయి. బలమైన రోగ నిరోధక శక్తిని వాల్ నట్స్ ఇస్తాయి.
6. వీటిలోని ప్రీ బయాటిక్ గుణాలు శరీరంలోని పేగు ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచే మంచి బ్యాక్టీరియాలు వృద్ధి చెందుతాయి.
7. ఊబకాయంతో బాధ పడుతున్న వారు, అధికంగా ఆహారం తీసుకుంటున్న వారు కూడా వాల్ నట్స్ ను తినడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఆకలిని తగ్గించి బరువును నియంత్రించడంలో తోడ్పడతాయి.
Read Also : Night bath: రాత్రిపూట స్నానం చేయడం వల్ల ప్రయోజనాలివే..