Nithya Menon: ప్రముఖ హీరోయిన్ నిత్యా మీనన్‌పై (Nithya Menon) ఇటీవల పెళ్లి వార్తలు వైరల్‌గా మారుతున్నాయి. ఈ మధ్య తరచూ వివాహం చేసుకోబోతోందనే వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వహించే నిత్య మీనన్‌కు తన బరువు కారణంగా ఆమె కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సాధారణంగా ఇప్పటి హీరోయిన్లు సైజ్ జీరో, జిమ్ చేసి ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. అలా బాడీని మెయిన్‌టైన్ చేసే వాళ్లకు మాత్రమే ఇప్పుడు అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. సక్సెస్ అవగలుగుతున్నారు.

మొన్నామధ్య ప్రెగ్నెంట్ లేడీ గా ఓ వెబ్ సీరీస్ లో యాక్ట్ చేసింది నిత్య మీనన్. వండర్ వుమన్ వెబ్ సీరీస్ తో ప్రేక్షకులని అలరించింది ఈ బొద్దుగుమ్మ. ఇక వండర్ వుమన్ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా నిత్యా మీనన్ అప్పట్లో సందడి చేసింది. ఆ నేపథ్యంలోనే తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నిత్య మీనన్. ఇటీవల తరచూ నిత్య మీనన్ పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో నటి నిత్యామీనన్ కాస్త బొద్దుగా ఉండటం వల్ల అవకాశాలు దక్కడం లేదనే వాదన వినిపిస్తోంది. కాస్త బరువు అధికంగా ఉండటం వల్ల నిత్య కన్న కలలు, కావాలనుకున్న పాత్రలు చాలా వరకు పోగొట్టుకుందన్న వాదన ఉంది. ఇక నటిగా గుర్తింపునిచ్చే పాత్రలతో నిరూపించుకున్న నిత్యా మీనన్.. ఆ మధ్యన డిజిటల్ ప్లాట్ ఫామ్ పైకి కూడా అడుగులు వేసింది.

వరుడు వివరాలు ఇవేనంటూ సోషల్ మీడియాలో తెగ వైరలైంది. ఆ పుకార్లను నిత్య మీనన్ గట్టిగా తిప్పికొట్టింది. తన వివాహం అనేది సోషల్ సెటప్ మాత్రమేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నిత్య మీనన్. తాను ఆచార సంప్రాదయాలకు విలువనిచ్చే అమ్మాయిని, పక్కా ట్రెడిషనల్ అమ్మాయినంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది. పెళ్లి అనేది ఫైనాన్సియల్ వ్యవహారాలతో ముడిపడిన వ్యవహారమని, తనకు మాత్రం అలాంటి సెక్యూరిటీ లేదన్నారు నిత్య. అంతకు మించి ఉంటే ఆలోచిస్తానని చెప్పింది. అంతకు మించి ఆలోచించే వాళ్లు ఉంటే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానంటూ కుండబద్ధలు కొట్టింది నిత్య.

నిత్యా మీనన్ 1988 ఏప్రిల్ 8న బెంగళూరులో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు మలయాళీ. కర్ణాటకలో స్థిరపడ్డారు. ఆమె పూర్ణ ప్రజ్ఞా స్కూల్, మౌంట్ కార్మెల్ కాలేజీ, బెంగుళూరులో విద్యాభ్యాసం పూర్తి చేసింది. తాను తొలుత జర్నలిస్ట్ అవ్వాలని అనుకున్నానని, కానీ చివరికి జర్నలిజంలో అనర్హత వేటు పడిందని పేర్కొంది. అందుకే ఫిల్మ్ మేకింగ్ వైపు మొగ్గు చూపానని పలు సందర్భాల్లో నిత్యా మీనన్ పేర్కొన్నారు.

తర్వాత ఫిల్మ్ అండ్ టెలివిజన్‌లో సినిమాటోగ్రఫీ కోర్సులో చేరానని నిత్యా మీనన్ తెలిపారు. పుణెలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో పాఠశాల ప్రవేశ పరీక్ష సమయంలో ఆమె డైరెక్టర్ బీవీ నందినిరెడ్డిని కలిసింది. నిత్యా మీనన్ నటనకు నందినిరెడ్డి ఫిదా అయ్యారు. అప్పటి నుంచే సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకొని రాణిస్తోంది. నిత్య బహుభాషావేత్త కూడా. మలయాళం, కన్నడ, తెలుగు, తమిళం, హిందీ సహా ఆరు భాషలు అనర్గళంగా మాట్లాడగల సామర్థ్యం నిత్యా మీనన్ సొంతం. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఆమె స్వరం చిరకాలం గుర్తుండిపోతుంది.
Read Also : Coriander Water Benefits: ధనియాల నీళ్లు తాగితే దండిగా ఉపయోగాలు!
