Cooking Oils: తీసుకొనే ఆహారాన్ని బట్టి మన శరీరంలో ఆరోగ్యం, అనారోగ్యం చోటు చేసుకుంటూ ఉంటాయి. మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి. ముఖ్యంగా మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఎంత తింటున్నామో చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చు.
కొందరికి తాము తీసుకొనే ఆహారంపై నియంత్రణ ఉండదు. ఏది పడితే అది తినేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటుంటారు. అందుకే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం కోసం మంచి ఫుడ్‌ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్ (Cooking Oils) కలిగించే ఫుడ్‌కు దూరంగా ఉండాలి. దీని వల్ల బాడీలో కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా అధికబరువు, ఊబకాయం, గుండె జబ్బుల్లాంటి సమస్యలు వెంటాడతాయి.
నేటి కాలంలో చాలా మందికి ఆహారం విషయంలో మంచి స్పృహ ఉండదు. ఆహారం పట్ల అలసత్వంగా ఉంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ముఖ్యంగా ఆయిల్ ఫుడ్ (Cooking Oils) ఎక్కువగా తీసుకునేవారిలో కొలెస్ట్రాల్ పెరిగే చాన్స్ ఎక్కువ ఉంది. ఇంట్లో మనం వంటకు వాడే నూనెల విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. ఏది పడితే ఆ ఆయిల్ వాడటం వల్ల కొలెస్ట్రాల్ శాతం పెరిగిపోయే వీలుంది.
కనోలా నూనె 63% మోనోశాచురేటెడ్ కొవ్వుతో కూడిన కూరగాయల ఆధారితంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ తగ్గించే ఒక ప్రసిద్ధ నూనెగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఎక్కువగా పాలీఅన్‌శాచురేటెడ్ ఒమేగా-6 కొవ్వులతో తయారైన మొక్కజొన్న నూనె గుండె జబ్బుల ప్రమాద కారకాలను తగ్గిస్తుందని అధ్యయనాల్లో కూడా నిరూపితం అయ్యింది. ఇది ఎక్కువ స్మోక్ పాయింట్‌ను కలిగి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఫ్రైయింగ్ ఆయిల్‌గా మొక్కజొన్న ఆయిల్ ప్రసిద్ధి గాంచింది.
వంట నూనెల్లో అన్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీసేవిగా ఉండవు. వంట నూనెల్లో సంతృప్త కొవ్వులు, అసంతృప్త కొవ్వులు ఉండే ఆయిల్స్ ఉంటాయి. ఈ రెండింటిలో అసంతృప్త కొవ్వులు ఉండే ఆయిల్ ఆరోగ్యానికి బెస్ట్. సంతృప్త కొవ్వులు ఉండే నూనె ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. న్యూట్రిషనిస్టులు సూచించిన మేరకు భారత్‌లో దొరికే వంట నూనెల్లో ఐదు రకాల వంటలు ఆరోగ్యానికి మంచివని చెబుతున్నారు. వాటిలో ఆలివ్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, కార్న్ ఆయిల్, వైట్ మస్టర్డ్ ఆయిల్, నట్స్ ఆయిల్ మంచివని చెబుతున్నారు.
మీ హృదయానికి ఇష్టమైన నూనెలలో ఒకటి నిస్సందేహంగా ఆలివ్ నూనె. యువత ఆరోగ్యానికి అమృతం అని గర్వంగా పిలుస్తారు. ఇది అన్ని తినదగిన మొక్కల నూనెలలో అత్యధిక శాతం మోనోశాచురేటెడ్ కొవ్వును కలిగి ఉంది. వాస్తవానికి, రోజుకు అర టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ వర్జిన్ ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని క్లినికల్ ఫలితాలు చూపిస్తున్నాయి.
మన ఇళ్లలో ఎక్కువ శాతం వేరుశెనగ నూనె కూడా వాడుతుంటారు. వేరుశనగ నూనె దాని స్వభావం ప్రకారం ట్రాన్స్ ఫ్యాట్-ఫ్రీ, కొలెస్ట్రాల్ లేని, సంతృప్త కొవ్వులు తక్కువగా ఉంటాయి. ఇది మోనోశాచురేటెడ్ కొవ్వులో అధికంగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్ విటమిన్ ఈ ఉంటుంది. ఇక సోయాబీన్, పొద్దు తిరుగుడు నూనెలో కూడా కొలెస్ట్రాల్ తక్కువగానే ఉంటుంది. రక్తపోటును తగ్గించడానికి ఈ నూనెలు దోహదం చేస్తాయి.
Read Also : The Nightmare Sleeping: పీడ కలలతో నిద్ర పట్టడం లేదా? ఈ చిట్కాలు పాటించండి