సుగంధ ద్రవ్యాల్లో యాలకుల (Cardamom) ప్రాశస్త్యం ఎక్కువ. యాలకులు (Cardamom) పూర్వ కాలం నుంచే వినియోగిస్తున్నారు. వీటిని ఇలాచీ (Cardamom) అని కూడా పిలుస్తారు. మంచి వాసన, రుచితో పాటు ఆరోగ్యపరంగా అనేక ఉపయోగాలు యాలకులు తీసుకోవడం వల్ల కలుగుతాయి. ప్రతి ఒక్క వంటింట్లోనూ యాలకులు నిల్వ ఉంటాయి. ముఖ్యంగా చాలా రకాల వంటల్లో యాలకులను వినియోగిస్తారు.
1. యాలకులతో మసాలా టీ చేసుకొని చాలా మంది ఆస్వాదిస్తుంటారు. యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
2. వ్యాధులు, ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా యాలకులు రక్షిస్తాయి. రోగ నిరోధక శక్తి కూడా పుంజుకొనేలా యాలకులు చేస్తాయి.
3. యాలకుల గింజల్లో ఎక్కువగా ఫైబర్ దాగి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా జీర్ణ సమస్యలున్న వారికి యాలకులు దివ్యౌషధం.
4. భోజనం తిన్న తర్వాత ఒక ఇలాచీని తీసుకొని నెమ్మదిగా నమలాలి. దీని వల్ల యాంటీ బ్యాక్టీరియల్ శక్తి నోరంతా వ్యాపిస్తుంది. దుర్వాసన తొలగిపోతుంది.
6. యాలకులను కూరల్లోనో, ఇలాచీ టీ తాగడం ద్వారానో, నేరుగా నోట్లో వేసుకొని నమలడం ద్వారానో తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
7. మలబద్ధకం, ఎసిడిటీ, గ్యాస్ ట్రిక్ ప్రాబ్లమ్, ఉబ్బసం, రిఫ్లక్స్ ను నివారించడంలో యాలకులు కీలక పాత్ర పోషిస్తాయి. రోజూ తీసుకొనే ఆహారంలో కొన్ని పదార్థాలు త్వరగా జీర్ణం కావు. ఇలాంటి నేపథ్యంలో రెండు యాలకులు తీసుకొని నమిలితే త్వరగా జీర్ణం అవుతుంది.
8. యాలకులు రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును కంట్రోల్ లో ఉంచేందుకు దోహదం చేస్తాయి.
9. రక్త ప్రసరణ కూడా సక్రమంగా జరిగేలా యాలకులు చేస్తాయి. మరోవైపు నోట్లో దుర్వాసన సమస్య చాలా మందిని వేధిస్తుంటుంది. ఇలాంటి వారు దంత ఆరోగ్యం కోసం కూడా యాలకులను వినియోగించవచ్చు.
Drinking Tea Mistakes: టీ తాగే సమయంలో ఈ తప్పులు చేయకండి
చాలా మందికి టీ తాగడం అలవాటు. కొందరు ఉదయాన్నే లేవగానే టీ తాగితే తప్ప మిగతా పనులకు ఉపక్రమించలేరు. తర్వాత ఆఫీసుల్లోనూ రెండు మూడు సార్లు టీ తాగే వారు అధికంగా ఉంటారు. ఇక బయటకు ఎక్కడికి వెళ్లినా ఓ ఛాయ్ లాగిస్తే గానీ మనసు కుదుట పడని వారు అధిక సంఖ్యలో ఉంటారు. అయితే, టీ తాగే సమయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు.
1. చాలా వేడిగా ఉన్న టీ తాగాలనుకోవడం పొరపాటని నిపుణులు సూచిస్తున్నారు. అత్యంత వేడిగా ఉన్నప్పుడు టీ తాగడం శ్రేయస్కరం కాదని చెబుతున్నారు.
2. ఇలా చేస్తే అన్న వాహిక దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీని వల్ల నోటి పూత కూడా వచ్చే ఆస్కారం లేకపోలేదు.
3. వేడిగా టీ గొంతులో పోసుకోవడం ద్వారా అన్న వాహిక దెబ్బతింటుంది కాబట్టి ఇలా చేయడం మానుకోవాలని చెబుతున్నారు.
4. వేడి వేడి టీ తొందరగా తాగడం కూడా ప్రమాదకరమని సూచిస్తున్నారు. అంటే ఓ రెండు సిప్ లలోనే టీ కంప్లీట్ చేసేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కూడా అన్న వాహికకు మంచిది కాదంటున్నారు.
5. మరోవైపు టీ తాగేటప్పుడు అందులో కొంచం సాల్ట్ వేసుకొని చాలా మంది తాగుతుంటారు. ఇలా చేయడం కూడా సమస్యల్ని తెచ్చి పెడుతుందట.
6. ఉప్పు టీలోకి కరిగిపోయి స్పటికాలను తయారు చేస్తుంది. ఇవి అన్న వాహికలోకి వెళ్తే చాలా సమస్యలు వస్తాయి.
7. చాలా మంది స్ట్రాంగ్ మసాలా టీ తాగడానికి ఇష్టపడుతుంటారు. ఇలాంటి టీ తాగితే కోరి సమస్యల్ని తెచ్చుకున్నట్లు అవుతుందంటున్నారు.
8. వీలైనంత వరకు నార్మల్ టీ తాగడానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. మసాలా టీలోని బలమైన సుగంధ ద్రవ్యాలు జీర్ణ క్రియను దెబ్బతీస్తాయని చెబుతున్నారు. ఆహారం జీర్ణం కావడంలో సమస్యలు ఎదురవుతాయి.
9. మరోవైపు చాలా మంది ఉదయం లేవగానే ఏమీ తినకుండా, అసలు బ్రష్ చేయకుండా పరగడుపున టీ తాగుతుంటారు. అలాంటి అలవాటు కూడా మంచిది కాదని సూచిస్తున్నారు.
Read Also : Foot Massage: పాదాల మసాజ్‌తో లాభాలు ఎన్నో.. 10 నిమిషాలు ఇలా చేయండి!