ప్రశాంతమైన నిద్ర (Beauty Sleep) అందరికీ అవసరమే. కంటి నిండా నిద్రపోతే రెగ్యులర్ లైఫ్‌లో పనులన్నీ సక్రమంగా, శ్రద్ధ పెట్టి చేసుకోగలుగుతారు. 24 గంటల సమయంలో కనీసం 8 గంటలైనా ప్రశాంతంగా నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కంటి నిండి నిద్రపోవడం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అమ్మాయిలైతే సరైన నిద్ర (Beauty Sleep) ఉంటే మరింత అందంగా తయారవుతారు. దీన్నే బ్యూటీ స్లీప్ (Beauty Sleep) అని పిలుస్తారు.
1. సాధారణంగా పిల్లలు పెద్దల కంటే ఎక్కువ నిద్రపోతూ ఉంటారు. ఇది వారి ఆరోగ్యానికి ఎంతో కీలకం. నవజాత శిశులకు 18 గంటల నిద్ర అవసరమని వైద్యులు సూచిస్తారు.
2. మధ్య వయస్కులైతే 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలని చెబుతారు. అంటే 18 నుంచి 58 ఏళ్ల వయసు వారికి ఇది వర్తిస్తుంది.
3. అమ్మాయిలు ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న వారు 8 గంటలు నిద్రపోవడం తప్పనిసరి. అలాంటప్పుడే మొహం అందంగా తయారవుతుంది.
4. డీప్ స్లీప్ లోకి వెళ్లాలి. అలా నిద్ర పోయి లేవగానే ప్రశాంతత లభిస్తుంది. మనసుకు హాయిగా అనిపిస్తుంది.
5. చర్మ సౌందర్యానికి కారణమవుతుంది. అయితే, అతి నిద్ర బద్ధకానికి దారితీస్తుంది. అధిక బరువు పెరగడానికి కూడా దోహదం చేస్తుంది.
6. శరీరంలోని కణాల రిపేరీ నిద్ర సమయంలోనే జరుగుతుంది. చర్మ కణాల మరమ్మతు కూడా ఈ సమయంలోనే జరుగుతుంది.
7. గాఢమైన నిద్ర వల్ల కణాల రిపేరీ సజావుగా జరుగుతుంది. చర్మంలో మెరుపులకు కారణమవుతుంది. మైండ్ రీఫ్రెష్ అవుతుంది.
8. డోపమైన్, సెరోటోనిన్ వంటి ఆరోగ్యకర హార్మోన్ల స్రావాన్ని పెంచేలా చేస్తుంది. శరీరంలో వాపు, ఉబ్బరం సమస్య దూరం కావాలంటే మంచి నిద్ర అవసరం.
లవర్స్, మ్యారీడ్ కపుల్స్.. ఇది మీకోసమే..
ప్రేమికులు, భార్యా భర్తల మధ్య బంధం ఎల్లప్పుడూ నిలబడలాంటే నమ్మకం కీలకపాత్ర పోషిస్తుంది. ఆనందకరమైన జీవితానికి, సుదీర్ఘ బంధానికి రిలేషన్ షిప్ లో ట్రస్ట్ ముఖ్యమైనదిగా చెప్పొచ్చు. ఇది చాలా సెన్సిటివ్ అంశం అయినా.. అయస్కాంతం లాగా ఆకర్షించే శక్తి దీనికి ఉంటుంది. ఎవరితోనైనా సరే.. బంధం బలపరుచుకోవాలంటే మొదట నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది సవాల్ తో కూడుకున్నదని చెబుతున్నారు.
1. నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కొన్ని సూచనలు పాటిస్తే సరిపోతుంది. ముందుగా ఇద్దరు కలిసి ఉండటానికి కారణాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. అర్థం చేసుకోవాలి. ఒకరి ప్రాముఖ్యతను మరొకరు తెలుసుకోవాలి.
2. ఇలా చేయడం వల్ల మీరు రిలేషన్ షిప్ లో మంచి మార్గం ఎంచుకున్నట్లు అర్థం చేసుకోవచ్చు. నమ్మకాన్ని పెంచుకోవడానికి ఇది సులువైన మార్గంగా చెబుతున్నారు నిపుణులు.
3. ఎప్పుడైనా గొడవల సందర్భంగా ఒకరి కుటుంబాన్ని మరొకరు హేళనగా మాట్లాడుకోకూడదు. ఇలా చేస్తే అగౌరవపరుస్తున్నారనే భావన మీ పార్ట్నర్ లో పెరిగిపోతుంది.
4. కొన్ని వ్యక్తిగత విషయాల్లో గోప్యత పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అబద్ధాలు చెప్పడం తగ్గించుకోవాలి. అన్ని వేళల్లోనూ ప్రతి విషయానికీ అవును, ఎస్ అనే సమాధానాలు ఇవ్వడం సరైంది కాదు. ఇలా వ్యవహరించడం సమస్యలకు దారి తీస్తుంది.
5. ఒకరినొకరు గౌరవించు కోవడం నేర్చుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తూ, గౌరవిస్తుంటే వారిని తిరిగి గౌరవించడం సంస్కారంగా అర్థం చేసుకోవాలి. ఇది పరస్పర అవగాహన, ప్రేమ పెరగడానికి దోహదం చేస్తుంది.
6. ఒకరినొకరు అగౌరవ పరిచే ఘటనలు జరిగితే బంధంలో నమ్మకం సడలుతుంది. ముఖ్యంగా సినిమాల ప్రభావం మీపై లేకుండా చూసుకోవాలి. సినిమా వేరు, నిజ జీవితం వేరు అని గ్రహించాలి.
7. మీ రిలేషన్ షిప్, స్నేహం, బంధం గురించి వాస్తవికంగా ఆలోచించాలి. నిజమైన గౌరవం, ప్రేమ, నమ్మకం, భావ వ్యక్తీకరణలో స్వచ్ఛత ఉండేలా చూసుకోవాలి.
Read Also : Sleeping Tips: నిద్రపట్టడానికి మంచి టిప్స్.. ఇలా ప్రయత్నించండి..