ఆదిపురుష్ ట్రైలర్ (Adipurush) ఈనెల 9వ తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం రెడీ అవుతోంది. ట్రైలర్‌ను 2D, 3D వెర్షన్‌లలో (Adipurush) విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఓసారి ట్రైలర్‌ను విడుదల చేసి.. జీఎఫ్‌ఎక్స్ విషయంలో కాస్త ఇబ్బందిపడ్డ చిత్ర యూనిట్.. ఈసారి పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 105 థియేటర్లలో 3D ట్రైలర్‌ను ఆదిపురుష్ ట్రైలర్ (Adipurush)ను స్ట్రీమింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్లుగా వెయ్యి కోట్ల రూపాయల అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రం.. ఆ రేంజ్‌లో కుంభస్థలం బద్దలు కొట్టాలంటే ముందు ట్రైలర్ ఇంపార్టెంట్.
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం ఆదిపురుష్. మొన్నామధ్య ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో విమర్శలు వచ్చాయి. మీమర్స్ అయితే రెచ్చిపోయారు. విమర్శలు, ప్రతి విమర్శలతో వేడి పుట్టించారు. రాజకీయ నేతలు కూడా దీనిపై స్పందించారు. రావణుడి గెటప్ పై అనేక విమర్శలు వచ్చాయి. ప్రభాస్ చిత్రం యానిమేషన్ ను తలపిస్తోందన్న విమర్శలు జోరుగా వచ్చాయి. దీనిపై హీరో ప్రభాస్.. డైరెక్టర్ ఓం రౌత్ పై సీరియస్ అయినట్లు కూడా కథనాలు వెలువడ్డాయి. విజువల్స్, యానిమేషన్ విషయంలో మార్పులు చేయాలని, కథలోనూ ఇంకా మార్పులు చేర్పులు జరగాలని డార్లింగ్ గట్టిగా సూచించినట్లు తెలుస్తోంది.
రీసెంట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్లను బట్టి చూస్తే.. గతంలో జరిగిన డ్యామేజీ కాస్త కంట్రోల్ అయినట్లు కనిపిస్తోంది. ఓంరౌత్ రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్ పవర్‌ఫుల్‌గా ఉండటంతో ఆదిపురుష్ మూవీకి ఒక్కసారిగా బజ్ పెరిగిపోయింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆదిపురుష్ ట్రైలర్‌కు కౌంట్ డౌన్ మొదలైపోయింది. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇదే ఊపులో సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేసుకుంటోంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను ఈనెల 9వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
ఆదిపురుష్ ట్రైలర్‌ను 2D, 3D వెర్షన్‌లలో రిలీజ్ చేస్తున్నారు. 3D ట్రైలర్‌ను ఎంపిక చేసిన 105 థియేటర్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని భద్రాచలంలో రాములోరి చెంత, ఏపీలోని తిరుపతిలో ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ట్రైలర్ తర్వాత చిత్రంపై అంచనాలను పెంచేసి భారీ ఓపెనింగ్స్ రాబట్టాలని చిత్ర మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మొత్తంగా ఆదిపురుష్ ఫుల్‌ప్లెడ్జ్ ట్రైలర్‌ను 3.20 నిమిషాల పాటు కట్ చేసినట్లు బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
ఈ ట్రైలర్‌లో విజువల్స్ గతంలో మాదిరి కాకుండా ఈసారి జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. విజువల్స్, యాక్షన్, సెంటిమెంట్ ప్రధానంగా ఆకర్షణగా ఉంటాయని సమాచారం. ట్రైలర్ ఫైనల్ కాపీని చూసిన చిత్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్లు టాక్. ముఖ్యంగా ప్రభాస్ కూడా ఇంప్రెస్ అయ్యారని తెలుస్తోంది. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్ గ్రాండ్‌గా విడుదల కానుంది. మొత్తంగా రూ.1000 కోట్ల టార్గెట్‌తో విడుదల కానున్న ఈ చిత్రానికి ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ట్రైలర్ చూసిన తర్వాత ఈ విషయం తేలుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
Read Also : Prabhas: మీకు తెలుసా..? ప్రభాస్‌ను ఓ హీరోయిన్ అన్నా అని పిలిచింది..!
