HomeLife StyleVastu for Main Gate: ప్రధాన గేటులో రెండు గేట్లు పెట్టొచ్చా.. వాస్తు శాస్త్రంలో ఏముంది?

Vastu for Main Gate: ప్రధాన గేటులో రెండు గేట్లు పెట్టొచ్చా.. వాస్తు శాస్త్రంలో ఏముంది?

వాస్తు నియమాల ప్రకారం చాలా మంది ఇళ్లు కట్టుకుంటారు. కొత్తగా ఇంటిని కట్టుకొనే వారు, ఇప్పటికే ఇల్లు ఉన్న వారు కూడా వాస్తు నిపుణుల సూచనలతో తగిన మార్పులు, చేర్పులు చేసుకుంటూ ఉంటారు. దీని వల్ల దోషాలు తొలగి ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని భావిస్తారు. అలాగే ఇంట్లో పెట్టుకొనే వస్తువుల విషయంలోనూ వాస్తు నియమాలు పాటిస్తుంటారు చాలా మంది. మరోవైపు ఇంటి బయట గేటు (Vastu for Main Gate) విషయంలోనూ వాస్తు నియమాలు పాటిస్తుంటారు. కొన్ని ఇళ్లకు రెండు గేట్లు (Vastu for Main Gate) ఉంటాయి. ఈ విషయంలో చాలామందికి అనుమానాలు ఉంటాయి.

1. బెడ్రూమ్ లో ఎలా ఉండాలి? ఏ దిక్కున పడుకోవాలి? మంచం ఏ దిశలో ఉండాలి? దేనితో తయారు చేసిన మంచం వాడాలి? ఇంట్లోని లైటింగ్, బల్బులు, ఇతర వస్తువులు, బట్టలు ఏ రంగులో వేసుకోవాలి? ఇలా అన్ని అంశాల్లోనూ వాస్తు శాస్త్రంలో కొన్ని ప్రత్యేక సూచనలు చేశారు. పూజా మందిరం విషయంలోనూ వాస్తు నియమాలు ప్రత్యేకంగా చెబుతారు.

2. ఇంటి ఆవరణ ఎలా ఉండాలి. వాహనాలు ఏ దిక్కులో పార్కింగ్ చేయాలనే అంశాలకూ వాస్తు నియమాలు ఉన్నాయి. ఇంటి గేటు విషయంలో చాలా మందికి అనుమానాలు ఉంటాయి. అలాంటి వారికి వాస్తు శాస్త్రంలో కొన్ని టిప్స్ సూచించారు.

3. ఇంటికి పెద్ద గేటు ఉంటే అందులో మరో రెండు గేట్లు పెట్టుకోవచ్చా? అనే సందేహం చాలా మందిని వెంటాడుతూ ఉంటుంది. ఈ అంశంలో వాస్తు నిపుణులు కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు.

4. ఇంటికి ప్రధాన గేటు 9 లేదా 12 అడుగులు ఉండాలని సూచిస్తున్నారు. అవసరాన్ని బట్టి ఈశాన్యం లేదా దక్షిణ-ఆగ్నేయం, ఉత్తర-ఈశాన్యం ఇలా ఉచ్చమైన స్థానాల్లో గేట్లు పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

5. అందులో ఒక చిన్న గేటు పెట్టుకోవచ్చని తెలుపుతున్నారు. కార్లు, ట్రాక్టర్లు లాంటి పెద్ద వాహనాలు వచ్చినప్పుడు మొత్తం గేటును వాడుకోవచ్చని సూచిస్తున్నారు.

6. బైక్ లు లేదా మనుషులు రాకపోకలు జరిపేందుకు చిన్న గేటు వాడుకోవాలని చెబుతున్నారు. ఇలా చిన్న గేటు ఒకటి మాత్రమే ఉండేలా చూసుకోవాలట.

7. తూర్పు గేటులో ఈశాన్యం రెక్కలో చిన్న గేటును ఏర్పాటు చేసుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు. అయితే, ఒక పెద్ద గేటు, రెండు చిన్న గేట్లు పెట్టుకోరాదని హెచ్చరిస్తున్నారు.

వాస్తు దోషం ఉందా? ఇలా చేయండి

మామిడితో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. వాస్తు దోష నివారణలో మామిడిచెట్టు ప్రాముఖ్యం ఎనలేనిది. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆనందాలు వెల్లి విరియాలని కోరుకుంటారు. ఇందుకోసం రాత్రింబవళ్లు కష్టపడుతుంటారు. అయితే, వాస్తు నియమాలు పాటించకపోవడం వల్ల చాలా మంది కష్టం వృథా అవుతుంటుంది. ఊహించని దోషాల వల్ల ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోతుంది.

1. ఇంట్లో సరైన వాస్తు నియమాలు పాటిస్తే సంపదలు మీ సొంతమవుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో మహిమాన్వితమైన మామిడిచెట్టుతో వాస్తు దోషాలు నివారించుకోవచ్చని సూచిస్తున్నారు.

2. అయితే, ఇంట్లో మామిడిచెట్టు పెంచడం మంచిది కాదని చాలా మంది చెబుతుంటారు. కానీ, వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆవరణలో మామిడి చెట్టు పెంచుకోవచ్చు.

3. మామిడి చెట్లు నాటితే అవి తియ్యటి మామిడి పండ్లను ఇస్తాయి. దీంతోపాటు కుటుంబంలో శ్రేయస్సును పెంపొందిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

4. వాస్తు నియమాల ప్రకారం మామిడిచెట్టును ఇంటికి నైరుతి దిశలో నాటాలి. ఈ దిశలో నాటడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది.

5. కుటుంబంలో ఆనందాలు, గృహశోభ చేకూరుతుంది. అయితే, మామిడిచెట్టు నీడ ఇంటి దగ్గర ఎప్పుడూ నాటకూడదు. దాని నీడ ఇంటిపై పడకూడదట.

6. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఐదారు మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉండేలా చెట్టును నాటకూడదట. ఇది ఇంట్లో గందరగోళాన్ని సృష్టిస్తుందని చెబుతున్నారు.

7. మామిడి ఆకులను తోరణాలుగా కడుతుంటారు. తోరణాలుగా కట్టడం వల్ల అనేక శుభాలు కలుగుతాయని, ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తాయని నమ్మకం.

8. అయితే, ఇందులోనూ కొన్ని టిప్స్ పాటించాలి. ఇంటి గుమ్మానికి 11 మామిడాకులు కడితే వాస్తు దోషాలు తొలగుతాయని చెబుతున్నారు.

Read Also : Beauty Sleep: బ్యూటీ స్లీప్.. అమ్మాయిలు ఇలా చేస్తే అందం రెట్టింపవుతుంది..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు