హెల్తీ ఫుడ్ (Health tips) తీసుకోవాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. అయితే, అది వాస్తవం కాదు. తక్కువ ఖర్చులోనే హెల్తీ ఫుడ్స్ (Health tips) తయారు చేసుకోవచ్చు. ప్రొటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థాల్లో పెసరపప్పు ఒకటి. ఇందులో క్యాలరీలు తక్కువ. వీటిలో ఉండే పోషకాలు మనిషి శరీరంలోని కండరాలను బలంగా తయారు చేయడంలో దోహదపడతాయి. పెసరసప్పు తింటే కడుపులో ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. పెసర్లు రాత్రిపూట ఓ గిన్నెలో వేసి అందులో నీటిని పోసి ఉదయాన్నే మొలకెత్తిన వాటిని తింటే మంచి ఆరోగ్యం మనసొంతమవుతుంది. ఈ మొలకల్లో బి-విటమిన్, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం లాంటి పోషక విలువలుంటాయి. పెసర మొలకల్లో ఉండే పదార్థాలు మన రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి.
1. మనందరం హెల్తీ ఫుడ్ తీసుకోవాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలేమో అని ఆలోచిస్తుంటాం. కానీ అది నిజం కాదు.
2. తక్కువ ఖర్చుతోనూ ఆరోగ్యం మన సొంతం చేసుకోవచ్చు. పోషకాహారం తక్కువ ఖర్చుతోనూ పొందవచ్చు.
3. ఆరోగ్యకమరైన ఆహారం అంటే కేవలం ఖరీదైనదే కాదు. తక్కువ కాస్ట్ లోనూ ఎన్నో పోషకాలున్న ఫుడ్ అందుబాటులో ఉందంటున్నారు ప్రముఖ డైటీషియన్లు.
4. మన ఆరోగ్యానికి ఆకుకూరలు రోజూ తినాలని వైద్యులు చెబుతుంటారు. ఆకుకూరల్లో పాలకూర అంటే చాలా మందికి ఇష్టం.
5. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. ఫైబర్, ఫ్యాట్, ప్రొటీన్, ఏ,సీ,ఈ,కే విటమిన్లు పొదిగి ఉంటాయి. అలాగే క్యాల్షియం, ఐరన్ లాంటి మినరల్స్ కూడా ఉంటాయి.
6. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనకు క్యాన్సర్ల బారి నుంచి రక్షణ కల్పిస్తాయి.
7. అలాగే శనగలు కూడా మనకు తక్కువ ధరకే దొరకుతాయి. వీటిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.
8. వీటిని మన రోజువారీ మెనూలో చేర్చుకోవాల్సిందేనంటారు డైటీషియన్లు.
9. బరువు తగ్గడం, జీర్ణక్రియ మెరుగుదల లాంటి అనేక ప్రయోజనాలు శనగలు తీసుకోవడం వల్ల ఉంటాయి.
10. వీటితోపాటు సిరిధాన్యాలు, అరటి పండ్లు కూడా తక్కువ ధరకే దొరుకుతాయి. వీటిని తీసుకోవడం వల్ల మనకు పోషకాలు మెండుగా లభిస్తాయి.
నిమ్మకాయతో అద్భుతమైన ప్రయోజనాలు..
11. నిమ్మకాయ మన నిత్య జీవితంలో భాగమైందంటే అతిశయోక్తి కాదు. ఆరోగ్యానికి దివ్యౌషధంగా ఇది పని చేస్తుంది.
12. అలాగే నిమ్మ ఆకులతో కూడా బోలెడు లాభాలున్నాయని మీకు తెలుసా? రోజూ నిమ్మరసం కలిపిన గోరు వెచ్చని నీరు తాగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి.
13. అలాగే నిమ్మ ఆకులను తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువే.
14. నిమ్మ ఆకుల్లో ఐరన్, క్యాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ బి1, వివిధ రకాల ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు, ప్లేవనాయిడ్స్, రైబోఫ్లోవిన్ సహా అనేక పోషక విలువలన్నాయి.
15. నిమ్మ ఆకులు వాసన చూస్తే చాలా రకాల ప్రయోజనాలు కూడాఉన్నాయి.
16. వీటిలో యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటెల్మింటిక్, యాంటీ ఫ్లాట్యులెంట్, యాంటీ మైక్రోబయల్, యాంటీ క్యాన్సర్ గుణాలు పుష్కలంగా దొరుకుతాయి.
17. ఈ విషయాలు అనేక అధ్యయనాల్లో సైతం నిరూపితమయ్యాయి.
18. ఇటీవల ఎన్సీబీఐలో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం, నిమ్మ ఆకుల్లో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీలో రాళ్లు లేకుండా, పెరగకుండా నిరోధిస్తుందని వెల్లడైంది. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న ప్రతి ఒక్కరికీ నిమ్మ ఆకు దివ్యౌషధంగా పని చేస్తుంది.
19. అలాగే మనలో చాలా మంది తలనొప్పితో బాధపడుతుంటారు. తలనొప్పిలో కూడా అనేక రకాలున్నాయి. ఎక్కువ సేపు కంప్యూటర్ పై పని చేసే వారికి తలనొప్పి వస్తుంటుంది.
20. ముఖ్యంగా మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు నిమ్మ ఆకులు వాసన చూస్తే తక్షణం రిలీఫ్ ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
21. నిద్ర పట్టకపోవడం, చికాకుగా ఉండటం లాంటి సమస్యలకూ నిమ్మ ఆకు వాసన చూడటం బెస్ట్ టిప్ అంటున్నారు. బరువు తగ్గడానికి కూడా నిమ్మ ఆకులు, నిమ్మ కాయలు వాడవచ్చు.
22. నీటిలో నిమ్మ ఆకులు వేసి మరిగించి టీ తయారు చేసుకొని తాగొచ్చు. స్నానం చేసేటప్పుడు కూడా వేడి నీటిలో కాసిన్ని నిమ్మ ఆకులు వేసి స్నానం చేస్తే చర్మ సమస్యలూ తగ్గుతాయి.
Read Also : Vastu Tips: గృహంలో వాస్తు దోషాలున్నాయా? డబ్బుకు ఇబ్బందులా.. ఇలా చేస్తే దశ తిరిగిపోతుంది!