Mangalya Dosha 2025: మాంగల్య కారకుడైన కుజుడు నవంబర్ 28 నుండి డిసెంబర్ 7 వరకు తన స్వస్థానమైన వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. ఈ కాలంలో కొన్ని రాశుల వారికి కుజ దోషం (Kuja Dosha) ఏర్పడే అవకాశం ఉంది. దీని వల్ల వైవాహిక జీవితంలో విభేదాలు, అపార్థాలు, ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా మేషం, వృషభం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. కుజ దోష నివారణ కోసం స్కంద స్తోత్రం లేదా సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిదిగా సూచించారు జ్యోతిష్య నిపుణులు.
కుజ దోష ప్రభావం రాశి వారీగా
మేషం (Aries):
రాశ్యాధిపతి కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నందున పెద్ద ఇబ్బందులు ఉండకపోయినా, చిన్నచిన్న అపార్థాలు తలెత్తవచ్చు. దంపతుల మధ్య వాదోపవాదాలు జరగే అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామితో పారదర్శకంగా మాట్లాడడం మంచిది.
వృషభం (Taurus):
సప్తమాధిపతి కుజుడు సప్తమంలో సంచరిస్తుండటం వల్ల దంపతుల మధ్య విభేదాలు, కోపతాపాలు ఎక్కువవుతాయి. మాట తొందరపాటు వల్ల సమస్యలు వస్తాయి. వృత్తి కారణంగా దూర ప్రయాణాలు ఉండవచ్చు, దాంతో దాంపత్య జీవితం ప్రభావితం అవుతుంది. ఓర్పుతో వ్యవహరించడం ఉత్తమం.
సింహం (Leo):
చతుర్థ స్థానంలో కుజ సంచారం వల్ల కుటుంబ సుఖం తగ్గే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో చల్లదనం, ఆస్తి వివాదాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. పెళ్లి ప్రయత్నాలు ఆలస్యం కావచ్చు. జీవిత భాగస్వామి అభిప్రాయం తీసుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
తుల (Libra):
ద్వితీయ స్థానంలో కుజ సంచారం కారణంగా కుటుంబంలో సుఖశాంతులు తగ్గుతాయి. పిల్లల కారణంగా విభేదాలు, ఆస్తి వివాదాలు రావచ్చు. ఈగో సమస్యలు పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి. దాంపత్య బంధం మెరుగుపడాలంటే ఓపెన్ కమ్యూనికేషన్ అవసరం.
వృశ్చికం (Scorpio):
కుజుడు ఈ రాశి స్వాధిపతి కాబట్టి పెద్ద ఇబ్బందులు ఉండవు. కానీ అధిక ఈగో, ఆధిపత్య ధోరణి వల్ల విభేదాలు తలెత్తవచ్చు. జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలు లేదా ఖర్చులు పెరగవచ్చు. మాటలలో జాగ్రత్త అవసరం.
ధనుస్సు (Sagittarius):
వ్యయ స్థానంలో కుజ సంచారం వల్ల ఈ రాశివారికి మాంగల్య దోష ప్రభావం ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలు, వాహన ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. ప్రయాణాలు తగ్గించడం మంచిది. ఒకరితో ఒకరు సాఫీగా మాట్లాడుకుంటే సమస్యలు తక్కువవుతాయి.
దోష నివారణ సూచనలు
ప్రతి రోజు లేదా మంగళవారం సుబ్రహ్మణ్యాష్టకం లేదా స్కంద స్తోత్రం పఠించడం
కుజ దోష నివారణ పూజలు చేయించడం
రక్తపదార్థ దానం చేయడం లేదా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం
🪔 మొత్తంగా:
కుజ దోషం ఉన్న రాశివారు అధిక కోపం, ఈగో, అహంకారం తగ్గించి సాంత్వనగా వ్యవహరిస్తే, దాంపత్య బంధం బలపడుతుంది. భక్తి, సహనం, ప్రేమతో ప్రతి సమస్య పరిష్కారమవుతుంది.
ఇవీ చదవండి: Mangal Gochar : దీపావళి తర్వాత కుజుడు సొంత రాశిలోకి.. ఈ రాశులపై అదృష్ట వర్షం!
Love Astrology: తులా రాశిలో కుజుడు.. ప్రేమ, పెళ్లిళ్లలో కలిసొస్తుంది!






