సోమవారం, 19 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Sports

Rishabh pant: ఐపీఎల్ రికార్డుడు బద్దలు కొట్టిన రిషబ్ పంత్.. రూ.27 కోట్లు!

Keerthanaa News Deskప్రచురణ తేదీ: ఆదివారం, 24 నవంబర్ 2024

Rishabh pant: ఐపీఎల్ రికార్డులను రిషబ్ పంత్ బ్రేక్ చేశాడు. రిషబ్ పంత్ రూ.2 కోట్లతో ఈ ఏడాది వేలంలోకి ప్రవేశించి భారీ ధర దక్కించుకున్నాడు. LSG, RCB అతడిని కైవసం చేసుకోవడానికి భీకర పోరు చేశాయి. ఈ యుద్దం చివరకు రూ. 27 కోట్లతో ముగిసింది. మధ్యలో SRH రూ.19.50 కోట్లకు ధర పెంచడం మరింత ఆసక్తిని పెంచింది. ఎల్‌ఎస్‌జీ 20.50 కోట్లకు చేర్చడంతో రిషబ్ ను దక్కించుకునేందుకు భారీ స్థాయిలో పోరాటం జరిగింది. ఎల్‌ఎస్‌జీ అత్యధికంగా రూ.20.75 కోట్లకు బిడ్ చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ RTMని ఉపయోచింది. దీంతో LSG బిడ్‌ను రూ.27 కోట్లకు పెంచి రిషబ్ (Rishabh pant)ను ఫైనల్ గా దక్కించుకుంది.

ఢిల్లీకి మిచెల్ స్టార్క్
మిచెల్ స్టార్క్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది. రూ. 11.75 కోట్లతో అతడిని వేలంలో తీసుకుంది. దీంతో గతేడాది అత్యధిక ప్రైజ్ పొందిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్.. ఈ సారి మాత్రం అందులో సగం ధర పలికాడు.

మార్క్యూ సెట్ 1 ముగియడంతో కీలక ప్లేయర్ల జాబితా తెలిసింది. ఎవరు ఏ ధరకు అమ్ముడయ్యారో చూస్తే..

రిషబ్ పంత్ – రూ. 27 కోట్లు (LSG)

అర్ష్‌దీప్ సింగ్ – రూ. 18 కోట్లు (PBKS)

కగిసో రబడ – రూ. 10.75 కోట్లు (GT)

శ్రేయాస్ అయ్యర్ – రూ. 26.75 కోట్లు (PBKS)

జోస్ బట్లర్ – రూ. 15.75 కోట్లు (GT)

మిచెల్ స్టార్క్ – రూ. 11.75 కోట్లు (DC)

ఇవీ చదవండి: IPL Auction: ఐపీఎల్ ఆక్షన్.. షాక్ ఇచ్చిన ప్రీతి? పర్సులో ఎంత సొమ్ము ఉందో తెలుసా?
Rishabh Pant: టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీని వెనక్కి నెట్టిన పంత్
WTC: ఆల్-టైమ్ రికార్డ్‌ను బద్దలు కొట్టిన రిషబ్ పంత్
Virat Kohli: విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ దేశీయ క్రికెట్‌కు తిరిగి వెళ్లండి!
IPL 2025: రిటెన్షన్‌లో ఆ స్టార్ ప్లేయర్‌కు రూ.20 కోట్లు?
IPL 2025 Retention: ఆర్సీబీకి కేఎల్ రాహుల్ పునరాగమనం?
IPL Final 2023: తిరుగులేని మహేంద్రుడు.. ఐదో టైటిల్‌ విశేషాలు ఇవే..

ట్యాగ్స్: , , , , , , , , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading