Climate Crisis: వంద కోట్ల మంది సామూహిక వలసలు..!

వాతావరణ సంక్షోభం (Climate Crisis) ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ అయ్యింది. కొన్ని దేశాలకు ఇది మరణ శాసనంగా (Climate Crisis) పరిణమిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఐక్యరాజ్య సమితి (UN) హెచ్చరించడం.. ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. ఐరాస భద్రతామండలిలో జరిగిన చర్చ సందర్భంగా సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ (António Guterres) ఈ విషయంపై కీలక ప్రసంగం చేశారు. భారత్‌ సహా అనేక దేశాలకు ఆయన హెచ్చరికలు చేశారు. వాతావరణ సంక్షోభంతో (Climate Crisis) సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతున్నాయని గుర్తు చేశారు. ఇది సామూహిక వసలకు దారి తీసే ఆస్కారముందన్నారు.

లండన్‌ నుంచి లాస్‌ ఏంజిల్స్‌ వరకు.. బ్యాంకాక్‌ నుంచి బ్యూనస్‌ ఎయిర్స్‌ దాకా ఇదే పరిస్థితులు ఏర్పడుతున్నాయని యూఎన్ సెక్రటరీ జనరల్‌ పేర్కొన్నారు. సుమారు 100 కోట్ల మందికి తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో సముద్ర మట్టాలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయన్నారు. ఇప్పటికే కొన్ని దేశాల తీర ప్రాంతాల్లో సముద్ర మట్టాల పెరుగుదల సగటు రేటు కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉందన్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే లోతట్టు ప్రాంతాలు శాశ్వతంగా కనుమరుగవుతాయని గుటెరస్‌ చెప్పారు.

టెంపరేచర్‌ 2 డిగ్రీలు పెరిగితే, సముద్ర మట్టాల పెరుగుదల డబుల్‌ అయ్యే అవకాశం ఉందని గుటెరస్‌ పేర్కొన్నారు. ఈ పరిస్థితులు కొనసాగితే బంగ్లాదేశ్, ఇండియా, నెదర్లాండ్‌ లాంటి దేశాలు ప్రమాదంలో పడినట్లేనని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఖండంలోని ప్రధాన నగరాలు తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందన్నారు. ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తున్న పర్యావరణ సంక్షోభాన్ని వెంటనే పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. లేదంటే ఆయా దేశాలకు మరణశిక్షలా పరిణమించే ఆస్కారం ఉందని తేల్చి చెప్పారు.

గతేడాది ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యావరణ సంస్థ ఓ నివేదికను వెల్లడించింది. అందులో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగు చూశాయి. ఎనిమిదేళ్లలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తేలింది. దీంతో 1993తో పోలిస్తే సముద్ర మట్టాల పెరుగుదల రేటు రెట్టింపు అయ్యిందని నివేదికలో స్పష్టమైంది. ఐరాస హెచ్చరికల నేపథ్యంలో భారత్‌ సహా అనేక దేశాలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

Disney cut Employees: 7 వేల మందిని తొలగించిన డిస్నీ

ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి. ఇటీవల అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, డెల్‌, మెటా, గూగుల్‌ సహా దిగ్గజ కంపెనీలన్నీ వేలాది మంది సిబ్బందిని తొలగించాయి. తాజాగా ఈ జాబితాలోకి ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో రారాజుగా ఉన్న డిస్నీ చేరింది.

ఆర్థిక అనిశ్చితి, మాంద్యం భయాల కారణంగా సుమారు 7 వేలంమదికిపైగా ఉద్యోగులను తొలగించడానికి డిస్నీ సిద్ధమైంది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. హాట్‌ స్టార్‌తో కలిసి సంయుక్తంగా డిస్నీ హాట్‌ స్టార్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతోంది డిస్నీ. ఈ క్రమంలో ఆదాయార్జన తగ్గడం, మాంద్యం భయాలు వెంటాడటంతో ఉద్యోగులను కుదించాలని వాల్ట్‌ డిస్నీ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల తొలగింపుతో 5.5 బిలియన్ల ఖర్చులను ఆదా చేయడానికి ప్రణాళిక వేసింది. స్ట్రీమింగ్‌ బిజినెస్‌ను మరింత లాభదాయకంగా మార్చడానికి కంపెనీలోని 7 వేల మంది ఉద్యోగులను తగ్గించుకోనున్నట్లు సంస్థ సీఈవో బాబ్‌ ఇగర్‌ వెల్లడించారు.

తాజాగా చేపడుతున్న ఉద్యోగుల తొలగింపు కంపెనీ మొత్తం ఎంప్లాయిస్‌లో 3.6 శాతమని సీఈవో తెలిపారు. సంస్థలో మొత్తం 2 లక్షల 20 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని చెప్పారు. డిస్నీ సబ్‌స్క్రైబర్లు ఇటీవల భారీ సంఖ్యలో తగ్గిపోయారు. మూడు నెలలల్లోనే డిస్నీకి వినియోగదారుల సంఖ్య ఒక శాతం తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 168.1 మిలియన్‌ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ క్రమంలో సంస్థ నష్టాల్లోకి కూరుకుపోతుండడంతో డిస్నీ కీలక చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.

ఇప్పటికే కొత్త నియామకాలు ఆపేసిన డిస్నీ.. ఇక ఉద్యోగుల తొలగింపును ప్రారంభించింది. బిజినెస్‌ ట్రావెల్స్‌ను కూడా తగ్గించేసింది. టూర్ల విషయంలోనూ తప్పనిసరిగా ఆమోదం పొందాలని సంస్థ స్పష్టం చేసింది.

లేఆఫ్స్‌తో అమెరికాలో లక్ష మంది తెలుగు వారి ఇక్కట్లు!

అమెరికాలో టెకీలకు అతి పెద్ద కష్టం వచ్చింది. ప్రస్తుతం లేఆఫ్‌ల సీజన్‌ నడుస్తుండడంతో ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఉంటుందో, ఎవరి ఉద్యోగం ఊడుతుందోనని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగాల తొలగింపులో సీనియర్‌ ఎంప్లాయా, జూనియరా అని చూడటం లేదు. కంపెనీ చేపట్టిన ప్రాజెక్టు లాభదాయకమా? లేదా? అని మాత్రమే సంస్థలు ఆలోచిస్తున్నాయి. ఈ క్రమంలో ఏళ్లతరబడి నమ్మకంగా పని చేస్తున్న ఉద్యోగుల్ని సైతం ఇంటికి పంపేందుకు వెనుకాడటం లేదు.

ఒక్క ఈమెయిల్‌తోనే ఉద్యోగాన్ని తొలగించేస్తున్నాయి. వేలాది మంది టెకీల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. దిగ్గజ సంస్థలైనప్పటికీ ఆర్థిక మాంద్యం కారణంగా ఈ నిర్ణయాలు తీసుకుంటుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోందని బాధిత ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడా కంపెనీలన్నీ ఇదే బాట పట్టడంతో భారతీయులు తీవ్ర ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అవసరం ఉన్నప్పుడు తీసుకొని ఇప్పుడు క్షణం ఆలోచించకుండా లేఆఫ్‌ల పేరిట ఉద్యోగాలు తొలగించడం సమంజసం కాదంటున్నారు.

ఏడాది, రెండేళ్లలో చేరిన వారితో పాటు 20 ఏళ్లుగా సుదీర్ఘంగా కంపెనీల్లో పని చేస్తున్న వారికీ ఇదే పరిస్థితి ఉంటోంది. దశాబ్దాలుగా ఉద్యోగులను అడ్డం పెట్టుకొని కోట్లు గడించిన సంస్థలు ఇప్పుడు ఉన్నపలంగా ఉద్యోగాలు తొలగించడంపై ఐటీ సెక్టర్‌లో కలకలం రేపుతోంది. ఆర్థిక మాంద్యం, నష్టాల నుంచి గట్టెక్కేందుకే ఇలా చేస్తున్నామని కంపెనీలు ప్రకటించడం గమనార్హం. సాధారణంగా పిల్లల చదువులు, తల్లిదండ్రులపై ప్రభావం పడకుండా ఇంతకు ముందు కంపెనీలు జాగ్రత్తలు తీసుకొనేవి. ఈసారి అది కూడా పట్టించుకోలేదు.

తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు లక్ష మంది అమెరికాలో ఐటీ కొలువులు చేస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంతకు ముందు ఉద్యోగాలు తొలగించే క్రమంలో కంపెనీ సుమారు రెండు నుంచి మూడు నెలల ముందే ఉద్యోగికి సమాచారం అందించేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి కూడాలేదు.

స్కిల్డ్‌ ఉద్యోగులకు ఎలాంటి ఢోకా లేదు

బడా కంపెనీల కంటే చిన్న కంపెనీల్లో చేరి ఆర్థిక మాంద్యం ముగిసే వరకు అక్కడే కొనసాగాలని అమెరికాలో చాలా కాలంగా ఉంటున్న సెటిలర్లు యోచిస్తున్నారు. ఈ దిశగా నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. అయితే, ఉద్యోగాల తొలగింపుకు గురైన వారు నైపుణ్యం కలిగి ఉంటే వారికి మధ్యతరహా సంస్థలు ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయని, స్కిల్డ్‌ ఎంప్లాయీస్‌ ఖంగారు పడాల్సిన పని లేదని నిపుణులు పేర్కొంటుండటం గమనార్హం.

Read Also : ChatGPT: ఛాట్‌ జీపీటీతో గూగుల్‌కు ముప్పు తప్పదా? ఛాట్‌ జీపీటీ అంటే ఏంటి?

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles