Tamannah item song: తమన్నా ఐటమ్‌ సాంగ్‌.. ఏఐ వెర్షన్‌లో ఎలా ఉంటుందంటే.. కట్టిపడేస్తున్న వీడియోలు!

Tamannah item song: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.. ఏఐ.. ఎక్కడ చూసినా ప్రస్తుతం వినిపిస్తున్న పేరు ఇది. కృత్రిమ టెక్నాలజీతో అన్ని రంగాల్లోనూ వినూత్న ప్రగతిని నమోదు చేసేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ దోహదపడుతోంది. అన్ని రంగాల్లోనూ దీన్ని ఇంప్లిమెంట్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలే ఓ న్యూస్‌ రీడర్‌ అవతారంలో ఏఐ వార్తలు చదువుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన ఓ హాట్‌ ఐటెం సాంగ్‌కు ఏఐ టెక్నాలజీని జోడించి వివిధ హీరోయిన్లు డ్యాన్స్‌ చేస్తే ఎలా ఉంటుందో కొందరు ట్రై చేశారు. (Tamannah item song)

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్నచిత్రం జైలర్‌. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల నువ్వు కావాలయ్యా వీడియో సాంగ్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో తమన్నా రొమాంటిక్‌ డ్యాన్స్‌ చేస్తూ ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్‌ అయ్యాయి. ఈ వీడియోలో హుక్ స్టెప్పులేసి డాన్స్ తో అదరగొట్టింది తమన్నా. అయితే ఇదే డాన్స్ వేరే హీరోయిన్స్ వేస్తే ఎలా ఉంటుందనేది చూపిస్తూ ఏఐ వెర్షన్ వీడియోస్ క్రియేట్ చేశారు. ఇందులో సీనియర్ హీరోయిన్లు సిమ్రాన్, కాజల్ ఈ కావాలయ్యా సాంగ్ కి డాన్స్ చేస్తున్నట్లు క్రియేట్ చేసిన వీడియోలు ఆశ్చర్యపరుస్తున్నాయి.

Read Also : Tamannaah Bhatia: విజయ్‌ వర్మతో అందుకే చనువుగా ఉంటున్నా.. మిల్కీబ్యూటీ తమన్నా బోల్డ్‌ స్టేట్‌మెంట్!

వెండితెరపై గ్లామర్ ట్రీట్ పెంచుతోంది తమన్నా. తద్వారా భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటోంది. శ్రీ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ హ్యాపీ డేస్ సినిమాతో కెరీర్‌లో స్థిరపడింది. తర్వాత వరుసపెట్టి స్టార్ హీరోల సినిమాల్లో నటించి పలు బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకుంది. 100% లవ్, ఆగడు, ఊపిరి, రచ్చ, రెబల్, బద్రీనాథ్, బెంగాల్ టైగర్, బాహుబలి, F2, F3 లాంటి సూపర్ సక్సెస్ సినిమాల్లో తమన్నా తన నటనతో ఆకట్టుకుంది.

టాలీవుడ్‌లో దాదాపు స్టార్‌ హీరోలందరి సరసన తమన్నా ఆడి పాడింది. తన అందాలతో తమిళ, హిందీ ప్రేక్షకులను కూడా ఆకర్షించింది. అలా సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న ఈ బ్యూటీ.. ఐటెం సాంగ్స్ చేయడానికి ముందుకొస్తోంది. ఇప్పుడు ముంబైలోనే సెటిల్ అయింది. తమన్నా బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉంది. రీసెంట్‌గా మెగాస్టార్‌ చిరంజీవి నటించిన భోళా శంకర్‌ మూవీలో తమన్నా యాక్ట్‌ చేస్తోంది. లస్ట్‌ స్టోరీస్‌ 2లో తమన్నా నటించిన సంగతి తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవలే ఈ సిరీస్‌ విడుదలైంది. ఇందులో తమన్నా హాట్‌ హావభావాలు ప్రేక్షకులను అలరించాయి.

Read Also : Tamannaah: శృంగార సన్నివేశాల్లో తమన్నా హాట్‌ హావభావాలు.. వీడియో క్లిప్స్‌ వైరల్‌!

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles