Riddhi Kumar: రాజ్ తరుణ్ హీరోగా నటించిన లవర్ మూవీలో తొలిసారి నటించి సినిమాల్లోకి అడుగు పెట్టింది అందాల తార రిద్ధి కుమార్. ఆ తర్వాత డార్లింగ్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రంలో అవకాశాన్ని కొట్టేసింది. ఇందులో కీలక పాత్ర పోషించింది రిద్ధి కుమార్. ఇటీవల వరుస సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం చేతిలో బోలెడు సినిమాలతో ఈ ముద్దుగుమ్మ బిజీగా ఉంటోంది. (Riddhi Kumar)
సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుండడం వల్ల తన షెడ్యూల్ నుంచి విశ్రాంతి దొరడం లేదని కొన్నాళ్లుగా మనసులోనే బాధపడిందట ఈ అమ్మడు. దీంతో తన బిజీ షెడ్యూల్ నుంచి ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుంటోందట. ఇందులో భాగంగానే విహార యాత్ర కోసం లండన్‌కు వెళ్లింది రిద్ధి కుమార్. అక్కడ సందర్శక ప్రాంతాలను చుట్టేస్తోంది. అనేక చారిత్రక ప్రాంతాలు, రిలాక్స్ అయ్యే చోట్లకు వెళ్లి సేద తీరుతోంది రిద్ధి. అక్కడి సందర్శక ప్రాంతాల్లో ఫొటో షూట్స్ చేసింది ఈ అమ్మడు. ఆ చిత్రాలను తన సోషల్ మీడియా వేదికలుగా అభిమానులతో పంచుకుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో ఆ ఫొటోలను పోస్టు చేసింది రిద్ధి కుమార్.
అందమైన డ్రెస్‌లతో హొయలొలికించే అందంతో రిద్ధి మైమరపిస్తోంది. అందులో భాగంగా హాట్ పోజులిచ్చింది ముద్దుగుమ్మ. లండన్ లోని ప్రఖ్యాత నేషనల్ గ్యాలరీ వద్ద రెడ్ కలర్ టోపీ పెట్టుకొని పోజులిచ్చింది రిద్ధి కుమార్. ఆ చిత్రం అభిమానులు లైక్ లు, షేర్లు కొడుతున్నారు. ఇక లండన్‌లోని భారతీయ బనారస్ రెస్టారెంట్‌లో క్యూట్ లుక్స్‌తో ఫొటోలు దిగింది రిద్ధి. హోటల్‌లో తాను ఆర్డర్ ఇచ్చిన తర్వాత.. వెయిట్ చేస్తూ ఫొటోకు పోజులిచ్చింది. ఇందులో అందం రెట్టింపు అయ్యిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇక లండన్‌లో పలు వీధుల్లో ఈ అమ్మడు చక్కర్లు కొట్టింది. అక్కడ షాపింగ్ చేస్తూ కూడా ఫొటోలకు పోజులు కొట్టింది. నేచురల్ అందంతో మైమరపిస్తోందంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు లండన్‌లోని విక్టోరియా పార్కులోనూ ఈ ముద్దుగుమ్మ సేద తీరింది. అక్కడా ఫొటో సెషన్ పెట్టింది. క్యూట్ లుక్స్‌తో స్టన్నింగ్ పిక్ పోస్టు చేసింది. అలాగే లండన్‌లోని చైనా టౌన్‌లోనూ రిద్ధి కుమార్ సరదాగా గడిపింది. ఇక విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియాన్ని కూడా రిద్ధి సందర్శించింది. అక్కడ బ్లాక్ డ్రెస్‌తో ఆకర్షణీయమైన ఫొటో దిగింది. ఇలా రకరకాలుగా రిద్ధి కుమార్ ఫొటోలను దిగి అభిమానులతో షేర్ చేసుకుంది.
రిద్ధి కుమార్.. మలయాళంలో ప్రణయ మీనుకలుడే కాదల్ (2019), దండం (2019) తో మరాఠీ చిత్రసీమలోనూ అరంగేట్రం చేసింది. క్యాండీ (2021) తో వెబ్ సిరీస్‌ల ప్రపంచంలోకి అడుగు పెట్టింది. అతాగే ఆమె హ్యూమన్ (2022) సిరీస్‌లో కూడా కనిపించి మెప్పించింది. మోడలింగ్ వృత్తిలో అడుగు పెట్టి కెరీర్‌ను మొదలు పెట్టిన రిద్ధి.. అందాల పోటీల్లో పాల్గొని 2015లో మిస్ పుణె, 2016లో ఫేస్ ఆఫ్ ఇండియా లాంటి అనేక టైటిళ్లను గెలుపొందింది. అదే సమయంలో తెలుగు సినిమా లవర్ ఈమెకు చాన్స్ ఇచ్చింది. దాని తర్వాత తన మాతృభాష మరాఠీలో, అనంతరం మలయాళం సినిమాల్లో ఓ వైపు బిజీగా ఉంటూనే వెబ్ సిరీస్‌లలో అడుగు పెట్టింది.
2018లో తెలుగులో రాజ్ తరుణ్ సరసన లవర్, విరాజ్ జె అశ్విన్ సరసన అనగనగా ఓ ప్రేమకథ సినిమాల్లో రిద్ధి కుమార్ నటించింది. తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం.. ప్రభాస్ హీరోగా వచ్చిన రాధేశ్యామ్‌లో కీలక పాత్ర పోషించి మెప్పించింది. అనంతరం హిందీ వెబ్ సిరీస్ క్రాష్ కోర్స్‌లో అన్నూ కపూర్‌తో కలిసి చేసింది.
Read Also : Tamannaah: శృంగార సన్నివేశాల్లో తమన్నా హాట్ హావభావాలు.. వీడియో క్లిప్స్ వైరల్!