Adipurush Pre Release Event: తిరుపతిలో జై శ్రీరామ్ నినాదాలు మిన్నంటాయి. రామనామంతో పట్టణం పులకించింది. డార్లింగ్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను (Adipurush Pre Release Event) తిరుపతిలో (Tirupati) నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాది మంది అభిమానులు (Prabhas Fans) తరలి వచ్చారు. ప్రభాస్ (Darling Prabhas) తన కెరీర్‌లో తొలిసారి చేసిన పౌరాణిక చిత్రం ఆదిపురుష్ (Adipurush) కావడంతో ఆయన అభిమానులు పట్టరాని సంతోషంతో ఎదురు చూస్తున్నారు. ఆదిపురుష్ సినిమాను టీ సిరీస్ వారు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ రిలీజ్ అవుతోంది.
బాహుబలి తర్వాత అంతటి విజయం ప్రభాస్‌కు దక్కలేదు. ఆదిపురుష్ మూవీతో ఆ లోటు తీర్చాలని అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నారు. దీంతో అభిమానుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. చిత్రం ఘన విజయం సాధించాలని, భక్తి పారవశ్యంతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో సీతాదేవిగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ కనిపిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 16వ తేదీన ఆదిపురుష్ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఆదిపురుష్ మూవీ రిలీజ్ నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుకను ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వేదికగా నిర్వహించారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని స్టేడియంలో నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా చినజీయర్ స్వామి హాజరయ్యారు. తిరుపతి పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రభాస్ అభిమానులు ప్రీ రిలీజ్ వేడుకను తిలకించేందుకు తరలి వచ్చారు. ఎస్వీయూనివర్సిటీ మైదానం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎటు చూసినా కాషాయ జెండాలు రెపరెపలాడుతూ కనిపించాయి.
ఇక అభిమానులు జై శ్రీరామ్ నినాదాలను హోరెత్తించారు. సీతారాముల దివ్య చరితను లవకుశుల వేషధారణలో ఉన్న చిన్నారులు చేసే గానంతో, వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. ముఖ్య అతిథులు రావడంతో ఈ కార్యక్రమం మరింత ఆకర్షణీయంగా మారింది. ఇలా ఉంటే అభిమానుల జోష్‌ను నీరుగార్చేలా తిరుపతి, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనూ జోరుగా వర్షం కురిసింది. అయితే, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అభిమానులు తమ ఆరాధ్య నటుడిని చూసేందుకు తరలి వచ్చారు.
ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆదిపురుష్ మానియా నడుస్తోంది. జై శ్రీరామ్ నినాదాలు, ప్రభాస్ నామం హోరెత్తిస్తున్నారు అభిమానులు. ఎక్కడ చూసినా సినిమా గురించే చర్చలు నడుస్తున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో అభిమానులు మరింత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆదిపురుష్ సినిమాలోని యుద్ధం సన్నివేశాలు ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రామ, రావణ యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా దర్శకుడు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో తారాగణం కూడా భారీగానే ఉంటోంది.
సైఫ్ అలీఖాన్, దేవదత్త నాగె, సన్నీసింగ్‌లను ఈ సినిమాలో భాగం చేశారు. అభిమానుల అంచనాలను రీచ్ అయ్యేలా మార్పులు, చేర్పులు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముందు తిరుమల వెళ్లిన హీరో ప్రభాస్.. శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ కూడా అభిమానులు పెద్ద ఎత్తున జై శ్రీరామ్, హాయ్ ప్రభాస్ డార్లింగ్ అంటూ కేకలు, అరుపులతో హోరెత్తించారు. ఆదిపురుష్ సినిమా 2డీ, 3డీలలో ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీతో మరోసారి పాన్ ఇండియా లెవల్‌లో ప్రభాస్ రేంజ్ ఏంటో చూస్తారంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Adipurush: ఆదిపురుష్ ట్రైలర్.. ఈసారి కొడితే సోషల్ మీడియా షేక్ అవ్వాలి!