Malaika Arora: అర్జున్‌ కపూర్‌ బర్త్‌ డే… మలైకా డ్రెస్‌ ఖరీదు రూ.99,000… అందులో ప్రత్యేకతలేమిటి?

Malaika Arora: బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌, మలైకా అరోరా జంట ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. భర్తతో విడాకుల తర్వాత అర్జున్‌ కపూర్‌తో కలిసి ఉంటోంది మలైకా. ఇటీవల జూన్‌ 26న అర్జున్‌ కపూర్‌ బర్త్‌ డే గ్రాండ్‌గా చేసుకున్నారు. ఈ వేడుకకు బాలీవుడ్‌ ప్రముఖులు హాజరయ్యారు. అర్జున్‌ కపూర్‌ ప్రేయసి మలైకా అరోరా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంత ప్రత్యేకత ఏంటంటే… ఆమె వేసుకున్న డ్రెస్‌. బర్త్‌ డే వేడుకల్లో బాడీ కాన్‌ డ్రెస్‌లో దిల్‌ సే చిత్రంలోని సూపర్‌ హిట్‌ పాట ఛయ్యా ఛయ్యాకు డాన్స్‌ చేసి మలైకా అందర్నీ ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అర్జున్ కపూర్ బర్త్ డే బాష్ వీడియోకు నెటిజన్లు కామెంట్లతో హోరెత్తించారు. (Malaika Arora)

అర్జున్‌ కపూర్‌ (Arjun Kapoor Birthday) పుట్టిన రోజు సందర్భంగా ప్రియురాలు మలైకా అరోరా (Malaika Arora) వేసుకున్న డ్రెస్‌పై (Malaika Arora dress) నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. డ్యాన్స్‌తో ఆకట్టుకున్న మలైకా అరోరా బాడీకాన్ డ్రస్ ఖరీదు ఎంత అనే చర్చ జోరందుకుంది. దీని ధర రూ.99 వేలని తెలుస్తోంది. మలైకా అరోరా రిబ్బడ్ బాడీకాన్ డ్రెస్ స్పానిష్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ లోవేకి చెందిన రిబ్బెడ్ కాటన్ జెర్సీలో ఆంథూరియం ట్యాంక్ డ్రెస్ అని పిలుస్తారట. స్లీవ్‌లెస్ వైట్‌ గౌన్‌పై ఎరుపు రంగు ఆంథూరియం పువ్వులను బ్యూటిఫుల్‌గా డిజైన్‌ చేశారు. మలైకా వైట్‌ అండ్‌ రెడ్‌ గౌనులో తళుక్కుమంది. కిల్లింగ్‌ స్టెప్స్‌తో ఇరగదీసిందంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు వెలిశాయి. బర్త్‌ డే వేడుకలో అర్జున్‌ కపూర్‌ సోదరి ఖుషీ కపూర్, అన్షులా కపూర్‌తో పాటు ఆమె ప్రియుడు రోహన్ థక్కర్, కునాల్ రావల్, అర్పితా మెహతా తదితరులు పాల్గొని సందడి చేశారు.

1973 అక్టోబర్‌ 23న మలైకా జన్మించింది. తండ్రి పేరు అనిల్‌ అరోరా. తల్లి జాయిస్‌ పోలికార్ప్‌. మలైకాకు ఒక సోదరి అమిత్ర అరోరా ఉన్నారు. ఆమె నటనలో రాణిస్తున్నారు. ప్రస్తుతం 47 ఏళ్ల వయసులోనూ తరగని అంద చందాలతో మలైకా ఆకట్టుకుంటోంది. ఆమె సొంతూరు కర్ణాటకలోని బెంగళూరు నగరం. తదుపరి ముంబైకి షిఫ్ట్‌ అయ్యింది. ముంబైలోనే బాల్యం, విద్యాభ్యాసం, కాలేజీ చదువులు పూర్తి చేసుకుంది. 2008 నుంచి టీవీ, సినిమాల్లో రంగ ప్రవేశం చేసిన మలైకా.. నాటి నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ వస్తోంది.

అప్పటికే పెళ్లి అయిన మలైకా అరోరా.. విడాకులు తీసుకున్న తర్వాత అర్జున్‌ కపూర్‌తో కలిసి సహజీవనం చేస్తోంది. 1998 డిసెంబర్‌ 12న అర్బజ్‌ ఖాన్‌తో మలైకా అరోరా వివాహం జరిగింది. వీరిద్దరికీ అర్హాన్‌ ఖాన్‌ అనే అబ్బాయి సంతానం. కొన్నేళ్ల సంసార జీవితం తర్వాత మనస్పర్ధల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. అనంతరం అర్జున్‌ కపూర్‌కు మలైకా దగ్గరైంది. మలైకాకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు కూడా విడిపోయారు. డ్యాన్స్‌, భరతనాట్యంలో మలైకా ప్రత్యేక ట్యాలెంట్‌ సొంతం చేసుకుంది. దాంతోపాటు యాక్టర్‌, మోడల్‌, వీజే, టీవీ పర్సనాలిటీ, ప్రొడ్యూసర్‌గా.. వివిధ రంగాల్లో విశేష ప్రతిభాపాటవాలను చూపుతోంది మలైకా అరోరా. యోగా డే వేడుకల్లోనూ యోగాసనాలతో అందరి దృష్టినీ ఆకర్షించడం మలైకా ప్రత్యేకత.

Read Also : Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ ఫొటో గ్యాలరీ..

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles