Bigg Boss Telugu 10 Wild Card Entries: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మొదటి వారం నుంచే రచ్చ రచ్చగా సాగుతోంది. 16 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ సీజన్‌లో ఇప్పటికే గొడవలు, వాదనలు, టాస్కులతో హౌస్ వేడెక్కింది. తొలి వారంలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగడం ఆసక్తిని పెంచగా.. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై వినిపిస్తున్న వార్తలు మరింత హైప్ పెంచుతున్నాయి.
మొదటి వారంలోనే ఊహించని ఎలిమినేషన్
బిగ్ బాస్ సీజన్ 10లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టారు. వీరిలో 10 మంది సెలబ్రిటీలు కాగా.. మరో ఆరుగురు కామన్ కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. షో మొదలైన మొదటి రోజు నుంచే కంటెస్టెంట్ల మధ్య అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. చిన్న చిన్న విషయాలకే వాదనలు, గొడవలు జరుగుతుండటంతో బిగ్ బాస్ హౌస్‌లో అప్పుడే వేడి వాతావరణం కనిపిస్తోంది. ఇక తొలి వారంలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టి బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. కామనర్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆర్జే చరణ్ మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ఎలిమినేట్ అయ్యాడు.
మరో ఎలిమినేషన్‌కు రంగం సిద్ధం?
మిడ్ వీక్ ఎలిమినేషన్‌తో ఒక కంటెస్టెంట్ బయటకు వెళ్లగా.. ఈ వారం చివర్లో మరో కంటెస్టెంట్ హౌస్‌ను వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం హౌస్‌లో కంటెస్టెంట్లను రెడ్ టీమ్, బ్లూ టీమ్గా విభజించి గేమ్ ఆడిస్తున్నారు. ఈ రెండు టీమ్స్ మధ్య పోటీని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు బిగ్ బాస్ వరుస టాస్కులు ఇస్తున్నాడు.
హై రిస్క్‌లో ముగ్గురు.. ఎవరు ఎలిమినేట్?
రెండు టీమ్స్ నుంచి హై రిస్క్‌లో ఉండే కంటెస్టెంట్‌ను ఎంపిక చేయాలని బిగ్ బాస్ ఆదేశించినప్పుడు మొదట రామ్ ప్రసాద్, ఆర్జే చరణ్ పేర్లు తెరపైకి వచ్చాయి. హౌస్‌మేట్స్ ఓటింగ్‌లో రామ్ ప్రసాద్ సేఫ్ కాగా.. ఆర్జే చరణ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇప్పుడు మరోసారి టీమ్స్ మధ్య టాస్క్ నిర్వహించగా.. ఓడిపోయిన కంటెస్టెంట్లు హై రిస్క్‌లోకి వెళ్లారు. ఈసారి అమన్, చిత్ర రాయ్, సుధీర్ రెడ్డి రిస్క్ జోన్‌లో ఉన్నట్లు సమాచారం. వీరిలో చిత్ర రాయ్ టాస్క్‌లో ఓడిపోవడంతో ఎలిమినేషన్‌కు గురయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
అసలు ట్విస్ట్ ఇప్పుడు మొదలు!
ఎలిమినేషన్ల కంటే ఇప్పుడు బిగ్ బాస్ అభిమానుల దృష్టి మొత్తం వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై పడింది. సాధారణంగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఉన్న సభ్యుల గేమ్ పూర్తిగా మారిపోతుంది. కొత్త కంటెస్టెంట్లు కొత్త ఎనర్జీ తీసుకురావడంతో పాటు.. గ్రూపులు, స్నేహాలు, వ్యూహాల్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈసారి కూడా బిగ్ బాస్ టీమ్ పలువురు క్రేజీ కంటెస్టెంట్లను రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
వైల్డ్ కార్డ్ లిస్ట్‌లో సీరత్ కపూర్?
లేడీ కంటెస్టెంట్ల కోటాలో ప్రముఖ హీరోయిన్ సీరత్ కపూర్ పేరు బలంగా వినిపిస్తోంది. సినిమాల్లో తన గ్లామర్, నటనతో గుర్తింపు తెచ్చుకున్న సీరత్ బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తే షోకు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే ఆమె ఎంట్రీపై ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ లేదు.
ఈ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయట!
సీరత్ కపూర్‌తో పాటు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఫేమ్ సోనియా, ఆషిక, ప్రముఖ సీరియల్ నటి సౌందర్య రెడ్డి పేర్లు కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో ఎవరెవరు నిజంగా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడతారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
జబర్దస్త్ నుంచి ఇద్దరు.. గేమ్ మారుతుందా?
ఇక కామెడీ కోటాలో కూడా బిగ్ బాస్ టీమ్ కీలకమైన ప్లాన్ చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. ప్రముఖ జబర్దస్త్ కమెడియన్లు నూకరాజు, రాకింగ్ రాకేష్లను బిగ్ బాస్ టీమ్ సంప్రదించిందని.. వారిద్దరూ షోలోకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్త నిజమైతే హౌస్‌లో కామెడీతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ మరింత పెరగడం ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు.
ఆరుగురు వస్తే హౌస్‌లో లెక్కలన్నీ మారాల్సిందే!
ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లను చూస్తే ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు భారీగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. హీరోయిన్, సీరియల్ నటి, యూత్ ఫేమ్, జబర్దస్త్ కమెడియన్లను కలిపి కొత్త కంటెస్టెంట్లను తీసుకొస్తే.. ఇప్పటికే హౌస్‌లో ఉన్న గ్రూపుల సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేర్లు అధికారికంగా ఖరారయ్యాయా? లేదా అనేది తెలియాల్సి ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై బిగ్ బాస్ టీమ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తి క్లారిటీ రానుంది. మరి ఈ లిస్ట్‌లో నిజంగా ఎవరెవరు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడతారో చూడాలి!
Read also: Bigg Boss Hosts Remuneration: సల్మాన్ ఖాన్ నుంచి నాగార్జున వరకు.. ఎవరి రెమ్యునరేషన్ ఎంత? టాప్‌లో ఎవరంటే!
Bigg Boss 10: నాగార్జున రెమ్యునరేషన్‌పై భారీ టాక్.. ఈసారి ఫీజు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Bigg Boss 10: బిగ్‌బాస్ హౌస్‌లో అసలు గేమ్ మొదలు.. నాగార్జునకే షాక్ ఇచ్చిన కొత్త కాన్సెప్ట్.. మ్యాజిక్ కీ ఎవరి చేతికి?






