రాగి పాత్రల (Copper Water) విశిష్టత ఎంతో ఎనలేనిది. రాగి పాత్రల్లో (Copper Water) వంటలు చేసుకొని తినడం, రాగి చెంబులు, గ్లాసుల్లో మంచి నీటిని తాడం వల్ల అనేక లాభాలు చేకూరుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. అనేక అనారోగ్య సమస్యలను కాపర్ వాటర్ (Copper Water) తాగి తగ్గించుకోవచ్చు. సంపూర్ణ ఆరోగ్యం కోసం రాగి పాత్రల్లో నీరు తాగడం శ్రేయస్కరమని నిపుణులు చెబుతున్నారు.
1. రాగి పాత్రల్లో నీరు తాగడం ఎంత ముఖ్యమో వాటిని శుభ్రంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం.
2. నేటి కాలంలో చాలా మంది వాటర్ ప్యూరిఫయర్లు, ఫిల్టర్ వాటర్ వాడుతుంటారు. తద్వారా దుమ్ము, ధూళి, కాలుష్యాన్ని నివారించుకుంటుంటారు.
3. అయితే, పాత కాలంలో ఇవన్నీ ఉండేవి కావు. నేరుగా బావుల్లో నీటినో, నదులు, కాలువల్లో నీటిని తాగేవారు. పూర్వం ఎక్కువ మంది రాగి చెంబుల్లోనే తాగునీటిని తీసుకొనేవారు. అందుకే అప్పట్లో రోగాలు చాలా తక్కువగా వ్యాపించేవి.
4. రాగి పాత్రల్లో నీటిని తాగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడే వారికి ఇది బెస్ట్ ఔషధంగా చెప్పొచ్చు.
5. ఎముకలు దృఢంగా తయారవుతాయి. కాలుష్య కారకాలు, హానికర సూక్ష్మ క్రిములను చంపేయడంలో రాగి పాత్రలు ఉపయోగపడతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడంలోనూ రాగి పాత్ర సాయపడుతుంది.
6. గుండె, మెదడుకు సంబంధించిన వ్యవస్థను రక్త సరఫరాను కాపర్ వాటర్ మెరుగుపరుస్తాయి. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
7. బ్రెయిన్ స్ట్రోక్ కూడా రాకుండా ఉంటుంది. వృద్ధాప్య సమస్యలు, ఇన్ ఫెక్షన్లు తగ్గుతాయి. రాగి నీటిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల ఇన్ ఫెక్షన్ల సమస్యే ఉండదు.
8. హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది. బరువు తగ్గాలనుకొనే వారు కూడా రాగి పాత్రల్లో నీటిని తాగిే మంచి ఫలితాలు వస్తాయి.
Home Remedies: ఇంట్లో ఈగల గోల తప్పించుకోవాలంటే ఇలా చేయాలి..
వర్షం వచ్చిందంటే ఈగలు స్వైర విహారం చేస్తుంటాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వర్షాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వానలు వదలడం లేదు. ఈ నేపథ్యంలో ఇళ్లలో ఈగల బెడద ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈగలు ముసురుతూ ఉంటాయి. పరిశుభ్రంగా ఉంచుకున్నా సరే.. ఇంటి తలుపులు తెరిచి ఉంచితే ఇక ఇంట్లోకి నేరుగా దూసుకొస్తుంటాయి ఈగలు. అయితే వీటిబారి నుంచి తప్పించుకోవాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరి.
1. చిన్న పిల్లలు ఇంట్లో ఉన్న వారు మరీ జాగ్రత్తగా ఉండాలి. వారు కిటికీలు, తలుపులు తెరిచి మూస్తూ ఉండడం వల్ల ఈగలు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది.
2. ఈగలు ఇంట్లో వస్తూనే అనేక రకాల బ్యాక్టీరియాలను, సూక్ష్మక్రిములను తీసుకొస్తాయి. ఇంట్లోని తినే పదార్థాలు, పండ్లు, అన్నం తినే ప్లేట్లు, వంటింట్లోని సామాన్లపై వాలి వ్యాధులను వ్యాపింపజేస్తాయి.
3. కూరగాయలు, ఆహార పదార్థాలపై వాలడం వల్ల జబ్బులకు కారణం అవుతుంది. ఓ గ్లాసు నీటిలో రెండు సాల్ట్ తీసుకొని బాగా కలుపుకోవాలి.
4. తర్వాత ఆ నీటిని ఓ స్ప్రే డబ్బా తీసుకొని నింపాలి. ఈగలు ఎక్కువగా వచ్చిన సందర్భాల్లో వాటిపై చల్లితే ఈగల గోల నుంచి విముక్తి కలుగుతుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
5. పుదీనా, తులసి ఆకులతో కూడా ఈగలను పారదోలవచ్చు. పుదీనా, తులిసి ఆకులను కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
6. నీటిని కలిపి స్ప్రే చేసే డబ్బాలో వేసుకొని ఈగలు ఎక్కువగా వస్తున్న సమయంలో వాటిపై చల్లితే మంచి ప్రభావం చూడవచ్చు.
7. ఇది పురుగుల మందులా పని చేస్తుంది. నల్ల మిరియాలు, చక్కెర కలిపిన ద్రావణాన్ని కూడా వినియోగించవచ్చు.
Read Also : Blood: ఏ వయసు వారిలో ఎంత రక్తం ఉండాలి? తక్కువ ఉంటే ఏం చేయాలి?