Credits pain: కలియుగంలో అందరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. వీటిలో ముఖ్యమైనది రుణ బాధలు. చాలామందికి మొండి బాకీల వసూలు కూడా క్లిష్టతరమైన సమస్యగా ఉంటుంది. ఇలాంటి తరుణంలో అప్పుల బాధలు తీరిపోవాలంటే ఏం చేయాలో తెలియక చాలా మంది మరింత కష్టాల్లోకి చేరుతుంటారు. ఈ నేపథ్యంలో అప్పులు పెరిగిపోతుంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించి వాటి నుంచి బయట పడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. (Credits pain)
గులాబీ పూలు, తెల్లటి ఖర్చీఫ్, బియ్యంతో పరిహారం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సోమవారం రోజున మీకు దగ్గరలో ఉన్న లక్ష్మీ నారాయణనుల ఆలయానికిగానీ, శ్రీరాముడి ఆలయానికి గానీ, శ్రీకృష్ణుని ఆలయానికి గానీ, లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి గానీ, శ్రీవేంకటేశ్వర స్వామి గుడికి గానీ వెళ్లాలి.
ఇలా వెళ్లేటప్పుడు ఓ తెల్లటి ఖర్చీఫ్, ఐదు గులాబీలు తీసుకోండి. వీటితోపాటు కొద్దిగా బియ్యం, బెల్లం ముక్కలు కొన్ని తీసుకోవాలి. గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నాక తెల్లటి ఖర్చీఫ్‌ను పరవాలి. ఐదు గులాబీలు, బియ్యం, బెల్లం ముక్కలు ఉంచి.. నాకు ఉన్న అప్పులు అన్నీ త్వరగా తీరిపోవాలి స్వామీ అని మనసులో కోరుకుంటూ వీటన్నింటినీ చేతితో కలపాలి.
ఓ ఐదు నిమిషాల పాటు ఇలా చేయాలి. తర్వాత దాన్ని మూటగా కట్టి ఎక్కడైనా పారే నీటిలో విడిపెట్టాలి. ఇలా పారేనీరు దగ్గర్లో లేకపోతే ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయాలి.
నాలుగు వారాలు అలా చేయాలి..
నాలుగు సోమ వారాలు చేయడం వల్ల ఏదో ఒక విధంగా డబ్బులు కలిసి వచ్చి మీకున్న అప్పులు త్వరగా తీరిపోతాయని చెబుతున్నారు. మరోవైపు మీరు ఇచ్చిన డబ్బు సకాలంలో వసూలు కాకుండా ఇబ్బంది పడుతుంటే గోమతీ చక్రానికి సంబంధించిన తాంత్రిక పరిహారం పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
ఈ పరిహారం నిర్మానుష్య ప్రదేశంలో చేయాలని చెబుతున్నారు. ఓ గోమతీ చక్రం కొనుక్కొని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి కొద్దిగా మట్టి తీసి గోమతీ చక్రం చేతిలో పట్టుకోవాలి. నాకు డబ్బులివ్వాల్సిన వారు త్వరగా ఇవ్వాలి అని మనసులో అనుకోవాలి. వారి పేర్లన్నీ చెప్పుకోవాలి.
తర్వాత గోమతీ చక్రాన్ని మట్టిలో కప్పిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఇలా చేయడం వల్ల త్వరగా డబ్బులు వసూలు అవుతాయని చెబుతున్నారు.