మంగళవారం, 15 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

Power Charges hike: వైసీపీ చేసింది పాపం.. కూటమి పెడుతున్నది శాపం!

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 6 నవంబర్ 2024

Power Charges hike: ఏపీలో విద్యుత్ చార్జీల పెంపుపై అన్ని పక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు నిరసనలకు పిలుపునిస్తున్నాయి. ఇలా ఉంటే ప్రభుత్వ వాదన మరోలా ఉంది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, దారుణాల వల్లే ఇప్పుడు విద్యుత్ చార్జీలు, ట్రూ అప్ చార్జీలు (Power Charges hike) పెంచాల్సి వస్తోందంటూ సర్కారు చెబుతోంది. విద్యుత్ చార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ లో ఆమె పోస్టు పెట్టారు.

‘‘విద్యుత్ ఛార్జీలపై గత ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సింది పోయి.. ఆ పాపపు పరిహారాన్ని ప్రజల నెత్తినే మోపుతోంది ఇప్పటి కూటమి సర్కార్. రూ.18వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలు వసూళ్ళ విషయంలో .. మా తప్పేం లేదని, మాకసలు సంబంధమే లేదని, భారం మాది కాదని, ప్రజల మీదే ఆ మొత్తాన్ని మోపుతున్నారు. సర్దుబాటు కాదు ఇది.. ప్రజలకు “సర్దుపోటు”. కూటమి సర్కారు ప్రజలకు ఇచ్చిన భారీ కరెంటు షాక్.

విద్యుత్ ఛార్జీల విషయంలో.. ‘‘వైసీపీ చేసింది పాపం అయితే.. రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కార్ పెడుతున్నది శాపం’’.

గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకు ఏం సంబంధం? ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తే పడే అదనపు భారం ప్రజల నెత్తిన మోపుతారా? 5 ఏళ్లలో వైసీపీ భారం రూ.35వేల కోట్లు.. 5 నెలల్లో కూటమి భారం రూ.18 వేల కోట్లా? వైసీపీకి మీకు ఏంటి తేడా?

వైసీపీ 9 సార్లు ఛార్జీలు పెంచిందని, కూటమి అధికారంలో కొస్తే ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచమని, అవసరం అయితే 30 శాతం తగ్గించేలా చూస్తాం అని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలపై కట్టుబడి ఉంటే, తప్పు ఎవరు చేసినా ఆ భారాన్ని ప్రజలపై మోపొద్దనే చిత్తశుద్ది మీకుంటే.. వెంటనే రూ.18 వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయండి. పడుతున్న భారంపై నిధులు ఇవ్వాలని మోడీని గల్లా పట్టి అడగండి. ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేస్తే ఊరుకోమని, కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తోంది.

ప్రజల ముక్కు పిండి ట్రూఅప్‌ ఛార్జీల రూపంలో, అధిక కరెంటు బిల్లులు వసూళ్లు చేస్తున్నందుకు నిరసనగా రేపటి నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తున్నాం.’’ అని షర్మిల తన ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇవీ చదవండి: Sharmila: సాయిరెడ్డికి షర్మిల కౌంటర్.. మీ బిడ్డలపై ప్రమాణం చేయగలరా?
YS Sharmila: షర్మిల కంట తడి.. అన్నపై హాట్ కామెంట్స్.. దౌర్భాగ్యుడు, శాడిస్ట్ అంటూ… పూర్తి ప్రసంగం ఇదీ
Sharmila: కరెంటు చార్జీల భారం ఉపసంహరించుకోవాలి
Jagan and Sharmila: కుటుంబ తగాదాలు రాజకీయం చేయొద్దు

ట్యాగ్స్: , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading