శనివారం, 19 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

Animals: జంతువుల అక్రమ రవాణా నియంత్రణకు నోడల్‌ అధికారుల నియామకం

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శుక్రవారం, 31 మే 2024

Animals: జూన్‌లో రానున్నపవిత్ర బక్రీద్ పర్వదినం సందర్భంగా జంతువుల అక్రమ రవాణా, జంతు వధ నియంత్రణకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమిస్తూ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులిచ్చారు. అక్రమ జంతు రవాణా, జంతువధ నియంత్రణ పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో డీజీపీ కార్యాలయంలో ఎం.రవీంద్రనాథ్‌బాబు అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (శాంతి భద్రతలు) నోడల్ అధికారిగా నియమించారు.

జిల్లా స్థాయి నోడల్ అధికారులుగా అదనపు ఎస్పీ లేదా డీఎస్పీ స్థాయిలో నోడల్ అధికారులను నియమించారు. ఈ అధికారులు జంతువుల అక్రమ రవాణా, జంతువధపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి ఎక్కడైనా అక్రమ జంతు రవాణా లేదా వధ జరుగుతుంటే తక్షణ చర్యలు తీసుకుంటారు. జంతువుల అక్రమ రవాణా, జంతువధల నియంత్రకు సంబంధించి జిల్లాల్లో ఆయా శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా జిల్లా పోలీస్ సూపరింటిండెంట్లను ఆదేశించారు.

వివిధ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని కబేళాలపై కూడా జంతు అక్రమ రవాణా, జంతువధపై ప్రత్యేక నిఘా ఉంచాలని డీజీపీ నోడల్ అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా అక్రమ జంతు రవాణా, జంతు వధ ఘటనలు జరిపే వారికి జంతుహింస నివారణ చట్టాల కింద విధించే శిక్షలు ఇతర అంశాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని డీజీపీ స్పష్టం చేశారు.

రానున్న బక్రీద్ పర్వదినం సందర్భంగా జంతువుల అక్రమ రవాణా,జంతు వధలను నియంత్రించాలని జంతు సంరక్షణ సంస్థ కార్యదర్శి ఎస్.గోపాల రావు రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యాన్ని దాఖలు చేశారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జంతువుల అక్రమ రవాణా, అక్రమ జంతువధల నియంత్రణకు చెక్ పోస్టులు వంటివి ఏర్పాటు ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డుకు పలు మార్గదర్శక ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ తరపున రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిల్లో నోడల్ అధికారులను నియమించింది.

ఇవీ చదవండి: AP New DGP: ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతల స్వీకరణ
DGP Disk Awards: శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతిభ కనబర్చిన పోలీసులకు ఏపీ డీజీపీ డిస్క్‌ అవార్డులు
Police commemoration day cm jagan: అసాంఘిక శక్తులను ఎప్పటికప్పుడు అణిచివేయాలి.. పోలీసు అమరవీరుల సంస్మరణలో సీఎం జగన్
AP DGP: ఏపీ డీజీపీ కీలక ఆదేశాలు.. వారిని పోలీసు విధులకు వినియోగించవద్దని స్పష్టీకరణ

ట్యాగ్స్: , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading