Police commemoration day cm jagan: అసాంఘిక శక్తులను ఎప్పటికప్పుడు అణిచివేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. సీఎం జగన్ పాల్గొని పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, దుష్టశక్తులకు గుణపాఠం చెప్పకుంటే సమాజంలో రక్షణ ఉండదన్నారు. ఈనెల 22 నుంచి 31 వరకు విజయవాడలో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. 24 నుంచి 27 వరకు పోలీసు ఉద్యోగుల పిల్లలకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు జరగనున్నాయి. 28న జిల్లా, రాష్ట్ర పోలీస్ కార్యాలయాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. (Police commemoration day cm jagan)
పుంగనూరు ఘటనలో ఓ పోలీస్ కన్ను కోల్పోయారు
పుంగనూరు ఘటనలో 40 మంది పోలీసులకు గాయాలయ్యాయి. అంగళ్లులో ప్రతిపక్ష పార్టీ పోలీసుల పై దాడులు చేయించింది. పుంగనూరులో ప్రతిపక్ష పార్టీ శాంతిభద్రతలకు విఘాతం కలిగించింది. కోటి 25 లక్షల మంది అక్కాచెల్లెమ్మల మొబైల్ ఫోన్లలో దిశ యాప్. న్యాయమూర్తులపై కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలాంటి దుష్టశక్తులను ధీటుగా ఎదుర్కోవాలి. దుష్ట శక్తుల విషయంలో కఠినంగా ఉండాలి. హోంగార్డుల జీతం రూ.12 వేల నుంచి రూ.21,300లకు పెంచాం. కానిస్టేబుల్ నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్ పెంచాం. 8 శాతం నుంచి 15 శాతానికి హోంగార్డులకు రిజర్వేషన్ పెంచాం.
పోలీసుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
వైద్య, ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్య భద్రత కల్పిస్తున్నాం. ఏపీతో పాటు హైదరాబాద్ లో గుర్తించిన 283 ఆసుపత్రుల ద్వారా చికిత్స. నగదు రహిత విధానంలో రూ.42.40 కోట్ల విలువైన వైద్య సేవలు. ఈ ఏడాది కాలంలో గృహ నిర్మాణ రుణాలు 98.85 కోట్లు.
విధి నిర్వహణలో అమరులైన పోలీసులందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం జరుపుకుంటున్నాం. గడిచిన 64 ఏళ్లుగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పోలీస్ ఉద్యోగం అనేది ఓ సవాల్. పోలీస్ కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటాం.
ఇదీ చదవండి: Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం.. దుర్గమ్మకు సీఎం జగన్ పట్టు వస్త్రాలు