Tirumala Samacharam 26-07-2023: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భారీ వర్షాలు కురుస్తుండడంతో శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి తగ్గింది. తిరుమలలోనూ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం 6 గంటల సమయం పడుతోంది. (Tirumala Samacharam 26-07-2023)
తిరుమల శ్రీవారికి నిన్న హుండీ ఆదాయం రూ.4.06 కోట్లు చేకూరిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 73,137 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. శ్రీవారికి 27,490 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
టీటీడీ ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థుల మధ్య ఘర్షణ
టీటీడీ శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు జిల్లాకు చెందిన డిగ్రీ విద్యార్థుల మధ్య వాగ్వాదం గొడవకు దారి తీసింది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడంతో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పలువురు స్వల్ప గాయాలపాలయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం చర్యలకు ఉపక్రమించింది. హాస్టల్ నుంచి 30 మంది విద్యార్థులకు ఉద్వాసన పలికింది.
Read Also : Gold Price today 26 July 2023: తులం బంగారం ఎంత తగ్గిందంటే.. ఈరోజు బంగారం ధరలు ఇవీ..