HomeAndhra PradeshChirutha attack in tirumala: తిరుమల నడకమార్గంలో భక్తుల భద్రతపై టీటీడీ ఫోకస్.. మృతి చెందిన...

Chirutha attack in tirumala: తిరుమల నడకమార్గంలో భక్తుల భద్రతపై టీటీడీ ఫోకస్.. మృతి చెందిన చిన్నారి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా

Chirutha attack in tirumala: తిరుమల కాలినడక మార్గంలో చిరుత దాడిలో మృతి చెందిన బాలిక కుటుంబానికి టీటీడీ అండగా నిలిచింది. ఇప్పటికే 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హైఅలర్ట్ జోన్ గా ప్రకటించిన టీటీడీ.. ఆ ప్రాంతంలో భద్రతా సిబ్బంది పర్యవేక్షణ తప్పనిసరి చేసింది. 100 మంది భక్తుల గుంపుని అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ముందు, వెనుక రోప్‌లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. నడకమార్గంలో సెక్యూరిటీ పెంపునకు నిర్ణయం తీసుకున్నారు. చిరుతపులిని బంధించడానికి 3 బోన్లు ఏర్పాటు చేశారు. బోనులో చిరుత చిక్కుకునే ప్రాంతాలను అధికారులు గుర్తించారు. (Chirutha attack in tirumala)

జేఈవో కార్యాలయంలో అటవీ శాఖ, పోలీసులతో ఈవో సమావేశం

నిన్న సాయంత్రం 6.30 గంటలకు పాప మిస్ అయిందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. పాప ఆచూకీ కోసం 70 మంది దాకా సిబ్బంది వెతికారన్నారు. నిన్న రాత్రి అటవీ ప్రాంతంలో సిబ్బంది గాలించారని, సీసీ కెమెరాల ద్వారా చూస్తే కాలినడక మార్గంలో జరగలేదన్నారు. కాలినడక నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్లిందా? అని విచారణ చేశామన్నారు. పాప మృతి చాలా భాదాకరమన్నారు.

రెండు కాలిబాటలను 6 గంటలకు మూసేయాలని ఆలోచిస్తున్నామన్నారు. టీటీడీ ఛైర్మన్, అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రతి పది మీటర్లకు సెక్కూరిటీ గార్డును నియమిస్తామని పేర్కొన్నారు. కాలిబాటలో వచ్చే భక్తులు చిన్న పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాలిబాటలో బోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. చిరుతను బంధించేందుకు ఇప్పటికే రెండు బోన్లు ఏర్పాటు చేసినట్లు ఈవో ధర్మారెడ్డి వివరించారు.

చిన్నారి లక్షిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా

నిన్ని చిరుత దాడిలో మృతిచెందిన చిన్నారి లక్షిత కుటుంబానికి టీటీడీ బాసటగా నిలిచింది. టీటీడీ తరఫున రూ.5 లక్షలు, అటవీశాఖ నుంచి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియాను టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ప్రకటించారు.

Read Also : Tirumala Samacharam 12-08-2023: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి మృతి

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు