Tirumala News: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. 23 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు గోవిందుడి సర్వ దర్శనానికి 12 నుంచి 18 గంటల వరకు సమయం పడుతోంది. నిన్న శుక్రవారం నాడు శ్రీనివాసుడిని 71,472 మంది భక్తులు దర్శించుకున్నారు. (Tirumala News)
Read Also : Sri Venkateswara: కలియుగ వైకుంఠ నాథునికి ఎన్ని కోట్ల ఆస్తులంటే..
31,980 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. క్యూలైన్లలో వేచి ఉన్న వారికి తాగునీరు అందిస్తున్నారు. కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న వారికి శ్రీవారి అన్నప్రసాదం, పాలు అందుబాటులో ఉంచుతున్నారు.
Read Also : Om Namo Venkatesaya: శ్రీ వేంకటేశ్వర స్వామికి శిలా రూపం ఎలా వచ్చిందంటే..
Read Also : Goddess Durga: సూర్యభగవానుని, దుర్గమ్మను ఎలా పూజించాలి?