PRC Commission: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12వ పీఆర్సీ (పే రివిజన్ కమిషన్) కమిషన్ ఏర్పాటు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు వెలువరించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్‌ను ఛైర్మన్ గా నియమిస్తూ పీఆర్సీ కమిషన్ (PRC Commission) ఏర్పాటు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై నివేదికను ఈ కమిషన్ రూపొందించనుంది. గత కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. PRC కమిషన్ మన్‌మోహన్‌సింగ్.. ఏడాదిలోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.ఎస్.జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. (PRC Commission)
ఏపీ ప్రభుత్వంలో (AP Govt) పలు కేటగిరీల్లో పని చేసే ఉద్యోగులు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో పని చేసే బోధనేత ఉద్యోగులు, వర్క్ ఛార్జ్‌డ్, ఫుల్ టైమ్ కంటింజెంట్ ఉద్యోగుల జీతాల స్ట్రక్చర్‌లో చేయాల్సిన మార్పు చేర్పులపై పీఆర్‌సీ కమిషన్ నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
Read Also : AP Cabinet Meeting: అసైన్‌మెంట్ ల్యాండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏపీ కేబినెట్‌లో నిర్ణయాలు..
ఉద్యోగులకు (Employees) సంబంధించిన అన్ని అంశాలపై కమిషన్ సిఫార్సులు చేయవచ్చని సీఎస్ జవహర్ రెడ్డి (CS KS Jawahar Reddy) పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకొని, అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని, అందుకనుగుణంగా కమిటీ సిఫార్సులు చేయాలని సూచించింది ప్రభుత్వం.
పీఆర్‌సీ కమిషన్ సాధారణంగా ఏపీలోని వెలగపూడి సచివాలయం (Velagapudi Secretariat) నుంచి పని చేయాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో, బయటి ప్రాంతాల్లో పర్యటించవచ్చునని సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వుల్లో సూచించారు. కమిషన్ చైర్మన్ మన్‌మోహన్‌సింగ్ (Manmohan Singh) బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది జగన్ ప్రభుత్వం.