Monsoon in Andhra Pradesh: ఉక్కపోతతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. నిప్పుల కొలిమిలా సూరీడు సెగలు కక్కుతుండడంతో ప్రజలు భరించలేకపోతున్నారు. వానలు పడాల్సిన సమయంలో ఎండలు మండిపోతుండడంతో దిక్కుతోచని స్థితి ఏర్పడింది. ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే జనం భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రుతుపవనాలు రావాల్సిన టైమ్‌కు రాకపోవడంతో దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఈనెల ప్రారంభంలోనే కేరళను రుతుపవనాలు తాకినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చేసరికి నెమ్మదించాయి. కదలబోమంటూ భీష్మించాయి. (Monsoon in Andhra Pradesh)
రాయలసీమ నుంచి ప్రస్తుతం రుతుపవనాలు కదలడం లేదు. ఫలితంగా కోస్తా, ఆంధ్ర ప్రాంతంలో వేడి గాలులు విపరీతమయ్యాయి. ఏసీలు లేనిదే పూటగడవని పరిస్థితి ఏర్పడింది. కూలర్లు కూడా ఈ వేడికి పని చేయడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇక ఫ్యాన్లు ఏమాత్రం వర్క్ చేయడం లేదని, కేవలం కూలింగ్ ఉంటేనే ప్రశాంతంగా ఉండగలిగే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇక రుతుపవనాల రాకపై వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ప్రజలను సలహాలు, సూచనలు ఇస్తోంది. (Monsoon)
దక్షిణ కోస్తాంధ్రలో విస్తరిస్తున్న మొదటి రుతుపవన వర్షాలు అడపా దడపా ప్రారంభం అయ్యాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కాస్త బలపడుతోంది. నెల్లూరు తీరానికి దగ్గరలో ఉపరితల ఆవర్తనం కారణంగా మేఘాలు భారీగా ముసురుకున్నాయి. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని తీర ప్రాంతల్లో నేడు మోస్తరు చినుకులు, తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడు ఏపీ వెదర్‌మ్యాన్ (Andhra Pradesh Weather Man) పేర్కొన్నారు.
ఇవాళ బంగాళాఖాతంలో ఏర్పడ్డ గాలుల సంగమం దక్షిణ కోస్తాంధ్రకు సమీపంగా వస్తుందని కాబట్టి, ఇవాళ రాయలసీమ జిల్లాలైన అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, వైయస్సార్, అలాగే నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని వెదర్‌మ్యాన్ తెలిపారు. ప్రస్తుతానికి తూర్పు రాయలసీమ జిల్లాలు, దక్షిణ కోస్తాంధ్రలో ఆకాశం పూర్తి స్థాయిలో మేఘావృతమైంది. కానీ రాత్రి సమయం వెళ్లేసరికి, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో నేడు వర్షాలు జోరుగా కురిసే చాన్స్ ఉందని తెలిపారు. తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ వర్షాలు చూడగలమని ఆయన తెలిపారు.
ఇక మిగిలిన జిల్లాల్లోనూ వానలు క్రమంగా విస్తరిస్తాయని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ సాయి ప్రణీత్ చెప్పారు. ఇవాళ రుతుపవనాలు దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోకి మాత్రమే ప్రవేశిస్తాయని వెల్లడించారు. కానీ తెల్లవారుజాము నుంచి సాయంకాలం వరకు ఎండలు, వేడి తీవ్రత కొనసాగుతుందన్నారు. నేటి రాత్రికి అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల, వైయస్సార్, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, గుంటూరు, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్.టీ.ఆర్., పల్నాడు, కాకినాడ, అనకాపల్లి, పార్వతీపురం మణ్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు.
కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, రైతులు జాగ్రత్త వహించాలన్నారు. మధ్య కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే చాన్స్ లేదని, వేడి కొనసాగుతుందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, చల్లటి వాతావరణం ఉంటుందని ఏపీ వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. కానీ అన్ని భాగాల్లో ఈ పరిస్థితులు ఉండవని తెలిపారు. ఎండ వేడి ఇవాళ 43 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు గరిష్టంగా నమోదవుతుందన్నారు.
Read Also : Monsoon: రుతుపవనాల రాకపై ఏపీ సర్కార్ అప్రమత్తం.. ఏపీలో అడుగు ఎప్పుడంటే..