National School games: జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ బాక్సింగ్ అండర్ – 17, 19 బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ బృందానికి పతకాలు దక్కాయి. క్రీడాకారులను పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్ష ఎస్పీడీ అభినందించారు. (National School games)
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న 67వ జాతీయ స్కూల్ గేమ్స్ “బాక్సింగ్ ” అండర్ – 17 ,19 బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు కాంస్య పతకాలు దక్కించుకున్నారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి జి.భానుమూర్తిరాజు తెలిపారు.
ఈ పోటీలు జనవరి 3 నుంచి జనవరి 10 వరకు ఢిల్లీలో జరిగాయని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
విజేతలు వీరే:
• అండర్ 19 బాలికల (45-48 కేజీలు) విభాగంలో మొహ్మద్ హీనా కౌసర్ (నారాయణ జూనియర్ కాలేజీ ,విశాఖపట్నం) కాంస్య పతకం సాధించారు.
• అండర్ 19 బాలికల (48-51 కేజీలు ) విభాగంలో కోలుసు నిహారిక (విశాఖ గవర్నమెంట్ జూనియర్ కాలేజి,విశాఖపట్నం) కాంస్య పతకం సాధించారు.
• అండర్ 19 బాలికల (51-54 కేజీలు) విభాగంలో గంగవరపు అక్షిత (గవర్నమెంట్ జూనియర్ కాలేజి ,రాజమహేంద్రవరం,తూర్పు గోదావరి జిల్లా) కాంస్య పతకం సాధించారు.
• అండర్ 17 బాలికల (46-48 కేజీలు) విభాగంలో మైలపిల్లి మేఘన ,సెయింట్ జాన్స్ పారిష్ స్కూల్ ,విశాఖపట్నం జిల్లా ) కాంస్య పతకం సాధించారు.
read also: Jagananna Thodu: జగనన్న తోడు నిధుల విడుదల.. చిరు వ్యాపారులకు తోడుగా ఉన్నామన్న సీఎం జగన్
CRT training program: APSSDC-Excel R-Inorganization of the CRT training program and placement program for the final year engineering students
Kesineni Nani: వైయస్సార్‌సీపీలోకి కేసినేని నాని.. ఎన్నికల వేళ ఏపీలో వేగంగా మారుతున్న రాజకీయాలు!
Kesineni Nani: వైయస్సార్‌సీపీలోకి కేసినేని నాని.. ఎన్నికల వేళ ఏపీలో వేగంగా మారుతున్న రాజకీయాలు!
Dharmana Prasad Rao: అన్ని వర్గాల అభిప్రాయాలను క్రోడీకరిస్తూ భూహక్కు చట్టాన్ని పటిష్ట పరుస్తాం
