CM Jagan Amalapuram Tour: స్వయం సహాయక సంఘాలకు శుభవార్త. ఏపీ ప్రభుత్వం వారికి నిధులు విడుదల చేయనుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పర్యటన ఖరారైంది. జూలై 26వ తేదీన కోనసీమ జిల్లా అమలాపురంలో పర్యటించనున్నారు సీఎం జగన్. అమలాపురం వేదికగా స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ రాయితీ నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. (CM Jagan Amalapuram Tour)
అమలాపురంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ రాయితీ నిధులను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. తొలుత బహిరంగ సభలో ప్రసంగం అనంతరం నేరుగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు ముఖ్యమంత్రి. సీఎం సభకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా యంత్రాగం కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి సభకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఏపీ ప్రభుత్వం ఇటీవలే రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) కోసం సున్నా వడ్డీ రుణ పథకాన్ని పునరుద్ధరణ చేసిన సంగతి తెలిసిందే. స్వయం సహాయక సంఘాలకు రూ.1,400 కోట్లు రిలీజ్ చేస్తూ ఈ పథకాన్ని మళ్లీ ప్రారంభించారు ముఖ్యమంత్రి జగన్. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 93.80 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్న 8.78 లక్షల స్వయం సహాయక సంఘాలకు ప్రయోజనం కలుగుతుదని అంచనా.
సున్నా వడ్డీ పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘాలకు లాభదాయకంగా ఉంటుందని ప్రూవ్ చేసి, మహిళల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను జాబితాను రూపొందించింది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఈనెల 26వ తేదీన అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తారు. స్వయం సహాయక సంఘాలకు నిధులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also: Jagananna Thodu: జగనన్న తోడు నిధులు విడుదల.. సాయం రూ.13 వేలకు పెంచుతామన్న సీఎం జగన్