YS Jagan archery: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆర్చరీ క్రీడాకారుడిగా మారారు. అదెలా.. అనుకుంటున్నారా? అయితే ఇది చదవండి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా నిన్న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పర్యటించిన ఆయన.. వైఎస్సార్ రైతు దినోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం నిన్ననే వైయస్సార్ జిల్లాకు చేరుకున్నారు. ఇడుపులపాయలో తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు. ఆ తర్వాత ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. (YS Jagan archery)
నిన్న సాయంత్రం కూడా వైయస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండల అభివృద్ధి పనులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి (మైనార్టీ సంక్షేమం) అంజాద్ బాష, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అటు తర్వాత నేడు కూడా జమ్మలమడుగు నియోజకవర్గంలో జగన్ పర్యటించారు. గండికోట వద్ద ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు సీఎం జగన్. గండికోటతో పాటు తిరుపతి, విశాఖపట్నంలోనూ ఒబెరాయ్ హోటళ్లు నిర్మించనుంది.
దాంతోపాటు వైయస్సార్ జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా నేడు సీఎం జగన్ గరండాల రివర్ ఫ్రంట్, వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీ, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఓపెనింగ్ చేశారు. వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభం సందర్భంగా ఆసక్తిసర సీన్ కనిపించింది. ఓ ఆర్చరీ క్రీడాకారుడు సీఎం జగన్‌కు విల్లు చేత పట్టించారు. విల్లును అందుకున్న ముఖ్యమంత్రి.. అభినవ అర్జునుడిలా దాన్ని ఎక్కుపెట్టారు. బాణాన్ని అందులో ఉంచి టార్గెట్‌ను నిశితంగా పరిశీలించి వదిలారు. నేరుగా గురి చూసి కొట్టడంతో అది టార్గెట్‌ను చేరిపోయింది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సీఎం జగన్ ఎప్పుడూ ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో బిజీగా ఉంటారని, ఇలా స్పోర్ట్స్ కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గురిచూసి కొట్టడంలో, అదను చూసి శత్రువును జయించడంలో జగన్ నేర్పరిగా మారారని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. అన్న లక్ష్యం నిర్దేశించుకున్నాడంటే ఇక తప్పేది లేదని చెబుతున్నారు.
🔥🎯👏👌 pic.twitter.com/dXGSpSYSU6
— Rahul (@2024YCP) July 9, 2023