శుక్రవారం, 23 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Actress Kausalya: 46 ఏళ్లైనా పెళ్లి చేసుకోని అమ్మ‌డు.. అసలు కారణం చెప్పిన నటి

Keerthanaa News Deskప్రచురణ తేదీ: సోమవారం, 20 జూలై 2026

Actress Kausalya: సినీ పరిశ్రమలో వివాహం చేసుకోకుండా స్వతంత్రంగా జీవిస్తున్న నటీమణులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ కౌసల్య ఒకరు. 46 ఏళ్ల కౌసల్య ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నారు. పెళ్లిపై తనకు వ్యతిరేకత లేదని, అయితే కొన్ని భయాలు, వ్యక్తిగత ఆలోచనల కారణంగా వివాహానికి దూరంగా ఉండిపోయానని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు.

మలయాళ సినిమాతో తెరంగేట్రం

బెంగళూరులో పుట్టి పెరిగిన కౌసల్య 1996లో విడుదలైన మలయాళ చిత్రం **‘ఏప్రిల్ 19’**తో కథానాయికగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు. గ్లామర్ పాత్రల కంటే కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే సంప్రదాయ, హోమ్లీ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ‘అల్లుడుగారు వచ్చారు’, ‘పంచదార చిలక’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. ఆ తర్వాత ‘గౌరి’, ‘మహానంది’, ‘వియ్యాలవారి కయ్యాలు’, ‘రాంబాబుగాడి పెళ్లాం’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘సవ్యసాచి’, ‘రంగ్ దే’, ‘హీరో’, ‘పురుషోత్తముడు’ తదితర సినిమాల్లో సహాయ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు.

పెళ్లిపై కౌసల్య ఏమన్నారంటే?

“పెళ్లిపై నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. సరైన వ్యక్తి జీవితంలోకి వస్తే వైవాహిక బంధం ఎంతో అందంగా ఉంటుంది” అని కౌసల్య తెలిపారు. అయితే తనకు తగిన వ్యక్తి దొరుకుతాడో లేదోననే భయం ఉండేదన్నారు. ఒక దశలో మంచి బంధం కోసం ఎదురుచూసినప్పటికీ అది తనకు సరిపడలేదని చెప్పారు. తన తల్లిదండ్రులతో ఎంతో అనుబంధం ఉందని, వారితోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. పెళ్లి చేసుకున్న తర్వాత అత్తమామలతో ఎలా కలిసిపోతాననే ఆందోళన కూడా తనను వెనక్కు నెట్టిందన్నారు. ఈ విషయాల గురించి అతిగా ఆలోచించడం వల్ల కొంతకాలం వివాహం, సంబంధాలపై దృష్టి పెట్టలేదని వివరించారు. కౌసల్య ఇంటర్వ్యూ వివరాలు

అనారోగ్యంతో సినిమాలకు విరామం

కొన్నేళ్ల క్రితం ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నానని, ఆ సమయంలో బరువు కూడా పెరిగినట్లు కౌసల్య చెప్పారు. దీనికి తోడు తాను నటించిన కొన్ని పాత్రలు ఆశించినంత సంతృప్తిని ఇవ్వకపోవడంతో సినిమాల నుంచి కొంతకాలం విరామం తీసుకున్నట్లు తెలిపారు. వివాహం చేసుకోవడం లేదా ఒంటరిగా జీవించడం పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని కౌసల్య వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం ఆమె కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తూనే తనకు నచ్చిన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Read also: Actress Hema: రూ.1.5 కోట్ల లగ్జరీ కారు కొనుగోలు చేసిన నటి హేమ.. ఆలయంలో ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్!
Actress Raasi: రాశి షాకింగ్ వ్యాఖ్యలు.. ‘నిజం’ సినిమాపై సంచ‌ల‌న కామెంట్స్.. తండ్రి మరణం జీవితాంతం మరిచిపోలేను!

ట్యాగ్స్: , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading