Preethi Mukundhan: టాలీవుడ్ ఎంట్రీతో వెలుగులోకి వచ్చి, ప్రస్తుతం సౌత్ ఇండియాలో బిజీ హీరోయిన్‌గా మారుతోంది యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్. తిరుచిరాపల్లికి చెందిన ఈ మోడల్ కమ్ డాన్సర్.. వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. తాజాగా ఈ బ్యూటీ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన నటించే బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది.
రుక్మిణి వసంత్ నో చెప్పడంతో వరించిన లక్కీ ఛాన్స్!
ధనుష్ కెరీర్‌లో 56వ చిత్రంగా తెరకెక్కనున్న భారీ ప్రాజెక్టుకు ‘లబ్బర్ పందు’ ఫేమ్ తమిళరసన్ మారి ముత్తు దర్శకత్వం వహించనున్నారు. డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట కన్నడ భామ రుక్మిణి వసంత్‌ను అనుకున్నారు. అయితే రుక్మిణి ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ సరసన ‘డ్రాగన్’ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉండటం వల్ల డేట్స్ సర్దుబాటు చేయలేకపోయినట్లు సమాచారం. దీంతో ఆ లక్కీ ఛాన్స్ ప్రీతి ముకుందన్‌ను వరించినట్లు తెలుస్తోంది. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
‘ఓం భీమ్ బుష్’ నుంచి పాన్ ఇండియా రేంజ్ వరకు..
శ్రీవిష్ణు హీరోగా వచ్చిన హారర్ కామెడీ చిత్రం ‘ఓం భీమ్ బుష్’ సినిమాతో ప్రీతి ముకుందన్ టాలీవుడ్‌కి పరిచయమైంది. ఆ సినిమా యావరేజ్‌గా నిలిచినా ప్రీతికి మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లోనూ ఈమె నటించింది. అయితే తెలుగులో ఆశించిన స్థాయిలో బ్రేక్ రాకపోయినప్పటికీ, కోలీవుడ్‌లో అడుగుపెట్టాక ఈమె జాతకం పూర్తిగా మారిపోయింది.
ఇటీవల విడుదలైన తమిళ చిత్రం ‘బ్లాస్ట్’ (అర్జున్, అభిరామిలతో కలిసి నటించిన సినిమా) బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఆ వెంటనే ‘ఇదయం మురళి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఈమె చేతిలో వరుసగా క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళంలో ‘దశమకన్’, మలయాళంలో ఒక సినిమాతో పాటు హిందీలో ప్రతిష్టాత్మక ‘నాగ్ జిల్లా’ చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. కెరీర్ ప్రారంభించిన రెండేళ్లలోనే పాన్ ఇండియా నటిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రీతికి.. ధనుష్ సినిమా కనుక అధికారికంగా ఓకే అయితే స్టార్ హీరోయిన్ల లీగ్‌లోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు హీరో ధనుష్ ప్రస్తుతం రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓం’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ముగియగానే తమిళరసన్ మారి ముత్తు చిత్రంలో జాయిన్ కానున్నారు.
Read also: Actress Raasi: రాశి షాకింగ్ వ్యాఖ్యలు.. ‘నిజం’ సినిమాపై సంచలన కామెంట్స్.. తండ్రి మరణం జీవితాంతం మరిచిపోలేను!
Actress Prema: ‘అరుంధతి’లో జేజమ్మగా నేను చేయాల్సింది.. కానీ అదృష్టం అనుష్కదే.. మనసులో మాట చెప్పిన నటి ప్రేమ
