HomeCinemaGedela Raju: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. ఒకేసారి ‘ఆహా’, ‘ప్రైమ్’లలో స్ట్రీమింగ్!

Gedela Raju: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. ఒకేసారి ‘ఆహా’, ‘ప్రైమ్’లలో స్ట్రీమింగ్!

Gedela Raju: ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే అని చెప్పాలి. సమంత ‘మా ఇంటి బంగారం’, సాయిపల్లవి ‘ఏక్ దిన్’, వడ్డే నవీన్ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’, దర్శన్ ‘ద డెవిల్’ వంటి భారీ క్రేజ్ ఉన్న చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను ముంచెత్తుతున్నాయి. అయితే, ఈ హడావుడి మధ్య ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఒక రా అండ్ రస్టిక్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒకేసారి రెండు ప్రముఖ ఓటీటీ సంస్థల్లో ప్రత్యక్షమై సర్ప్రైజ్ చేసింది.

థియేటర్లలో మిస్సయిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి!

ప్రముఖ సింగర్, నటుడు రఘు కుంచె, వికాస్ ముప్పల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గేదెల రాజు కాకినాడ తాలూకా’. ఈ ఏడాది ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ లేకపోవడంతో ప్రేక్షకుల దృష్టిని పెద్దగా ఆకర్షించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద సరైన గుర్తింపు దక్కించుకోలేకపోయిన ఈ రా అండ్ రస్టిక్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్, ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఎలాంటి హడావుడి లేకుండా ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఆహా (Aha) లలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

కథేంటంటే.. కాకినాడ రౌడీ షీటర్ మర్డర్ మిస్టరీ!

ఈ సినిమా కథ అంతా కాకినాడ బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది. ఆ ప్రాంతంలో ఓ వెలుగు వెలిగిన రౌడీ షీటర్ ‘గేదెల రాజు’. తనకున్న అంగబలం, అర్థబలంతో ఎలాగైనా రాజకీయాల్లోకి ప్రవేశించి సెటిల్ అవ్వాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న తరుణంలో, గేదెల రాజు దారుణ హత్యకు గురవుతాడు.

రాజు మరణంతో కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. అతనికి శత్రువులుగా ఉన్న స్థానిక నేతలు, వ్యాపారవేత్తలతో పాటు అతని నమ్మకస్తులైన స్నేహితులు, వ్యక్తిగత జీవితంలో సన్నిహితంగా ఉన్న కొందరు వ్యక్తులు ఈ కేసులో ప్రధాన అనుమానితులుగా మారుతారు. అసలు గేదెల రాజును అంతమొందించిన ఆ అజ్ఞాత శత్రువు ఎవరు? ఈ పొలిటికల్ మర్డర్ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? పోలీస్ విచారణలో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? అనే ఉత్కంఠభరిత అంశాలతో ఈ క్రైమ్ థ్రిల్లర్ సాగుతుంది.

థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు, రస్టిక్ క్రైమ్ సస్పెన్స్ సినిమాలను ఇష్టపడే వారికి వీకెండ్ వాచ్‌గా ‘గేదెల రాజు’ ఒక మంచి ఆప్షన్ కానుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ‘ఆహా’ లేదా ‘ప్రైమ్’లలో ఈ వీకెండ్ క్రైమ్ మిస్టరీని చూసేయండి.

Read also: Nagabandham OTT: థియేటర్లలో విజువల్ వండర్.. ఇప్పుడు ఓటీటీలోకి ఎప్పుడు? అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
OTT Releases: ఓటీటీలో సినిమాల జాతర.. ‘పెద్ది’ నుంచి ‘త్రికాల’ వరకు.. స్ట్రీమింగ్‌కు సిద్ధమైన 35 కొత్త మూవీస్, వెబ్ సిరీస్‌లు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు