Lenin Movie: అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. జూలై 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్, పాటలు, గ్లింప్స్‌తో సినిమాపై ఆసక్తి పెరిగిన వేళ.. విడుదలకు ముందు మరోసారి చర్చనీయాంశంగా మారింది హీరోయిన్ మార్పు.
మొదట ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికై, కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది. అఖిల్-శ్రీలీల కలిసి ఉన్న అధికారిక పోస్టర్లు కూడా విడుదలయ్యాయి. అయితే చివరికి ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సే కనిపించడంతో సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. తాజాగా వాటన్నింటికీ నిర్మాత నాగవంశీ పూర్తి వివరణ ఇచ్చారు.
హీరోయిన్ ఎందుకు మారింది?
సినిమా ప్రమోషన్లలో మాట్లాడిన నాగవంశీ.. ఈ మార్పు వెనుక ఎలాంటి వివాదం లేదని స్పష్టం చేశారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. సినిమా ప్రారంభమైన తర్వాత కథకు సంబంధించిన కొన్ని క్రియేటివ్ మార్పులు జరిగాయి. దీంతో షూటింగ్ షెడ్యూల్ ఆలస్యమైంది. ఇదే సమయంలో శ్రీలీల ఇప్పటికే ఇతర సినిమాలకు డేట్స్ కేటాయించారు.
తర్వాత ‘లెనిన్’ షూటింగ్‌కు తేదీలు ఖరారు చేసే సమయానికి, శ్రీలీలకు బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రాజెక్ట్‌తో పాటు ‘పరాశక్తి’ వంటి భారీ చిత్రాల షూటింగ్‌లు ఉండటంతో డేట్స్ సర్దుబాటు కాలేదు. దీంతో ఇరు పక్షాల అంగీకారంతోనే హీరోయిన్‌ను మార్చాల్సి వచ్చిందని నాగవంశీ తెలిపారు.
రీషూట్ చేయాల్సి వచ్చిన సన్నివేశాలు
హీరోయిన్ మార్పు కారణంగా ఇప్పటికే చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను మళ్లీ చిత్రీకరించాల్సి వచ్చిందని నిర్మాత వెల్లడించారు. దీంతో కొంత అదనపు సమయం, ఖర్చు అయినప్పటికీ, సినిమా నాణ్యత విషయంలో రాజీ పడలేదన్నారు.
భాగ్యశ్రీపై ప్రశంసలు
భాగ్యశ్రీ బోర్సే ఈ పాత్రను అద్భుతంగా పోషించిందని నాగవంశీ కొనియాడారు.
సినిమా ఫైనల్ కాపీ చూసిన తర్వాత..”ఈ పాత్ర భాగ్యశ్రీ కోసమే రాసినట్టుంది” అనిపించే స్థాయిలో ఆమె నటించిందని ఆయన ప్రశంసించారు. ట్రైలర్‌లోనూ భాగ్యశ్రీ గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాకు ఆమె మరో ప్రధాన ఆకర్షణగా మారింది.
‘లెనిన్’పై పెరిగిన అంచనాలు
మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో రూపొందిన ‘లెనిన్’ ఓ గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెరకెక్కింది. భావోద్వేగాలు, యాక్షన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో పాటు గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సినిమాను రూపొందించినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. అఖిల్ అక్కినేని కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారు. గత కొంతకాలంగా సరైన విజయాన్ని ఎదురుచూస్తున్న ఆయనకు ‘లెనిన్’ కీలక చిత్రంగా మారింది.
పుకార్లకు ముగింపు
శ్రీలీల సినిమా నుంచి తప్పుకోవడానికి పారితోషికం, కథ, లేదా ఇతర విభేదాలు కారణమని గత కొద్ది నెలలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే నిర్మాత నాగవంశీ తాజా వ్యాఖ్యలతో ఆ ప్రచారానికి తెరపడింది. డేట్స్ క్లాష్ కారణంగానే హీరోయిన్ మార్పు జరిగిందని అధికారికంగా స్పష్టత రావడంతో, అభిమానుల సందేహాలకు కూడా సమాధానం లభించింది.
ఇప్పుడు అందరి దృష్టి జూలై 10న విడుదల కానున్న ‘లెనిన్’ బాక్సాఫీస్ ఫలితంపైనే ఉంది. అఖిల్‌కు ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందిస్తుందా? భాగ్యశ్రీ బోర్సే నటన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.
ఇవీ చదవండి: Veerabhadruni Rahasyam OTT: ఊహించని ట్విస్టులు.. చివరి వరకు సస్పెన్స్.. ఈ మిస్టరీ థ్రిల్లర్ మిస్ అవ్వొద్దు!
Akhil: ‘లెనిన్’కు ఎన్టీఆర్ సర్‌ప్రైజ్.. వాయిస్ ఓవర్‌తో యంగ్ టైగర్ స్పెషల్ టచ్!
Akhil Akkineni: అయ్యగారే నెం.1పై అఖిల్ రియాక్షన్.. అభిమానుల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనంటూ కామెంట్స్
