HomeCinemaTollywood Director: స్టార్ డైరెక్ట‌ర్ కు రియల్ ఎస్టేట్ మోసం.. రూ.7 కోట్ల భూమి వివాదం

Tollywood Director: స్టార్ డైరెక్ట‌ర్ కు రియల్ ఎస్టేట్ మోసం.. రూ.7 కోట్ల భూమి వివాదం

Tollywood Director: టాలీవుడ్‌లో కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీను వైట్ల రియల్ ఎస్టేట్ మోసానికి గురయ్యారు. వికారాబాద్ జిల్లా చేవెళ్ల ప్రాంతంలో వ్యవసాయ భూమి కొనుగోలు వ్యవహారంలో కొందరు వ్యక్తులు ఆయన్ని నమ్మించి మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది.

నమ్మించి రూ.1 కోటి తీసుకున్న మోసగాళ్లు
కొన్నేళ్ల క్రితం వికారాబాద్ జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు శ్రీను వైట్లను సంప్రదించి తమకు చేవెళ్లలో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని అమ్మాలని చూస్తున్నామని తెలిపారు. వారు చూపించిన పత్రాలను నమ్మిన దర్శకుడు ఆ భూమిని కొనుగోలు చేసేందుకు సుమారు రూ.1 కోటి వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని సమాచారం.

కోర్టు తీర్పుతో బయటపడిన నిజం
ఇటీవలి వరకు ఆ భూమి తనదేనని భావించిన శ్రీను వైట్లకు కోర్టు తీర్పుతో షాక్ తగిలింది. ఆ స్థలం అసలు యజమానులు వేరే వ్యక్తులని, మోసగాళ్లు ఫోర్జరీ పత్రాలు లేదా తప్పుడు సమాచారంతో ఆయనను నమ్మించారని తేలింది. ప్రస్తుతం ఆ భూమి మార్కెట్ విలువ సుమారు రూ.7 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

CCS పోలీసులకు ఫిర్యాదు
తనను మోసం చేసి వేరే వ్యక్తుల స్థలాన్ని తనకు అమ్మినట్లు గుర్తించిన శ్రీను వైట్ల వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ వ్యవహారంపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.

ఇవీ చ‌ద‌వండి: Mega Star Chiranjeevi: ఉగాది రోజున కీల‌క నిర్ణ‌యం తీసుకున్న మెగాస్టార్.. ఉచిత‌ విద్య దిశగా మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం
AI cyber fraud: షాపింగ్ మాల్‌లో కొత్త సైబర్ మోసం.. ఫోన్ ఇచ్చి సహాయం అడిగితే జాగ్రత్త!
Star Heroine : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్.. ఎవరో తెలుసా?
Telugu Movie Directors: గోల్డెన్ ఛాన్స్‌లు వృథా చేసిన దర్శకులు… పాన్ ఇండియా అవకాశాలు ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు