Trisha Krishnan Vijay: దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న త్రిష కృష్ణన్ పేరు తాజాగా సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు వెలువడిన నేపథ్యంలో అనూహ్యంగా త్రిష పేరు కూడా చర్చకు వచ్చింది. విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేసిందనే వార్తలు బయటకు రావడంతో, సోషల్ మీడియాలో విజయ్–త్రిష రిలేషన్‌షిప్‌పై పుకార్లు వేగంగా వ్యాపించాయి. ఇద్దరూ ఇటీవల ఒక కార్యక్రమంలో కలిసి కనిపించడంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి.
విజయ్‌తో పెళ్లి.. రాజకీయాల్లోకి త్రిష?
కొంతమంది నెటిజన్లు త్వరలో విజయ్–త్రిష పెళ్లి చేసుకుంటారని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు, త్రిష సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని కూడా కథనాలు వైరల్ అయ్యాయి. ఈ మధ్యనే ప్రముఖ నటుడు, దర్శకుడు చిత్రా లక్ష్మణన్ ఒక ఇంటర్వ్యూలో త్రిష ఇకపై సినిమాల్లో నటించకపోవచ్చని వ్యాఖ్యానించడంతో, ఈ వార్తలు మరింత చర్చకు దారితీశాయి.
సోషల్ మీడియాలో త్రిష స్ట్రాంగ్ రియాక్షన్
ఈ రూమర్స్‌పై త్రిష తనదైన స్టైల్‌లో స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆమె వ్యంగ్యంగా ఇలా రాసింది: “అవును… నేను సినిమాలు మానేసి ఒక ధనవంతుడైన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నాను. నిన్నటికి రెండేళ్లు నిండిన నలుగురు కవలలను పెంచుతున్నాను. మీ ఊహాగానాలకు ఇది సరిపోతుందా? లేక ఇంకా ఏదైనా జోడించాలా?” ఈ పోస్టుతో సినిమాలు మానేసిందనే వార్తలు పూర్తిగా పుకార్లేనని త్రిష స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను ఆమె సరదాగా తిప్పికొట్టింది.
త్రిష చేతిలో భారీ సినిమాలు
త్రిష సినీ కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళంలో సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో చిరంజీవి సరసన నటించిన ‘విశ్వంభర’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు మలయాళంలో మోహన్‌లాల్‌తో కలిసి ‘రామ్’ అనే చిత్రంలో కూడా ఆమె నటిస్తోంది. ఇవి అన్ని గత సంవత్సరం లేదా అంతకంటే ముందు ఆమె అంగీకరించిన సినిమాలు కావడం గమనార్హం. దీంతో త్రిష సినిమాలు మానేస్తుందనే వార్తలకు ఎలాంటి నిజం లేదని స్పష్టమైంది.
ఇంకా అదే జోరు
ఇప్పటికీ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్‌లలో త్రిష ఒకరు. రెండున్నర దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆమె, ఇప్పటికీ స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ తన క్రేజ్‌ను కొనసాగిస్తోంది.

ఇవీ చదవండి: Vijay – Trisha Krishnan: విజయ్ – త్రిష వ్యవహారం: రూమర్స్, రియాక్షన్స్, రియాలిటీ?
Vijay Trisha: విజయ్–త్రిష రిలేషన్‌పై ఖుష్భూ రియాక్షన్.. అలా ఎందుకు అంటూ కీలక వ్యాఖ్యలు
Vijay Trisha Krishnan: విజయ్ – త్రిష బంధంపై కోలీవుడ్‌లో చర్చ.. వైరల్ అవుతున్న రూమర్లు
Vijay Trisha: కోలీవుడ్‌లో దుమారం: విజయ్, త్రిషపై సింగర్ సంచలన వ్యాఖ్యలు
