Vijay Trisha: గత కొన్ని రోజులుగా కోలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశంగా మారిన విషయం నటుడు, తమిళ రాజకీయ పార్టీ TVK (Tamilaga Vettri Kazhagam) అధినేత విజయ్ మరియు ప్రముఖ నటి త్రిషకు సంబంధించిన వార్తలే. వీరిద్దరి రిలేషన్‌పై సోషల్ మీడియా నుంచి సినీ వర్గాల వరకు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల ఒక కార్యక్రమానికి ఇద్దరూ కలిసి హాజరైన నేపథ్యంలో ఈ గాసిప్స్ మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్భూ సుందర్ ఈ అంశంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“అది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం”
ఓ మీడియా ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుష్భూ మాట్లాడుతూ.. విజయ్–త్రిష సంబంధంపై జరుగుతున్న చర్చలను ప్రశ్నించారు. “ఈ విషయం ప్రజలతో ఏ విధంగా సంబంధం ఉందో నాకు అర్థం కావడం లేదు. ఇది పూర్తిగా వారి వ్యక్తిగత జీవితం. అది ప్రజలను ప్రభావితం చేస్తే మాట్లాడవచ్చు. కానీ వారి వ్యక్తిగత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు” అని ఆమె స్పష్టం చేశారు.
ఇటీవల సోషల్ మీడియాలో ఈ అంశం వైరల్ అవుతుండటంపై కూడా ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజలు ఎందుకు పెద్ద విషయం చేస్తున్నారో అర్థం కావడం లేదు ఖుష్భూ మాట్లాడుతూ, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను అనవసరంగా పెద్ద విషయంగా మార్చడం సరైంది కాదని అన్నారు. “వాళ్లు తమకు నచ్చినట్లుగా జీవిస్తారు. దాని వల్ల ప్రజలు ఎలాంటి ప్రభావం పొందరు. మరి ప్రజలు ఎందుకు దీనిని పెద్ద విషయంగా చూస్తున్నారు?” అని ఆమె ప్రశ్నించారు.
విజయ్ రాజకీయాలపై ప్రభావం ఉంటుందా?
ఈ వివాదం విజయ్ రాజకీయ జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉందా అనే ప్రశ్నకు కూడా ఖుష్భూ సమాధానం ఇచ్చారు. “ప్రజలు చాలా తెలివైనవారు. ఎవరికి ఎందుకు ఓటు వేయాలో వారికి బాగా తెలుసు. ఒక నాయకుడి వ్యక్తిగత జీవితం రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేస్తుందని నేను అనుకోవడం లేదు” అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో విజయ్ కూడా ఒక మనిషే అని, నాయకుడైనా కాకపోయినా అతనికి కూడా వ్యక్తిగత జీవితం ఉంటుందని చెప్పారు.
కోలీవుడ్‌లో హాట్ టాపిక్
విజయ్–త్రిష పేర్లు గతంలో కూడా పలుమార్లు వార్తల్లోకి వచ్చాయి. తాజాగా ఇద్దరూ కలిసి ఒక ఈవెంట్‌కు హాజరుకావడంతో ఈ గాసిప్స్ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు విజయ్ లేదా త్రిష అధికారికంగా స్పందించలేదు.
ఇక ఖుష్భూ చేసిన తాజా వ్యాఖ్యలు ఈ చర్చకు మరో కోణం తీసుకొచ్చాయి.
ఇవీ చదవండి: Vijay Sangeetha: విజయ్–సంగీత విడాకుల వివాదం.. త్రిషతో కనిపించిన వీడియోపై నటి సనం శెట్టి ఆగ్రహం
Vijay: విడాకుల రూమర్లపై తొలిసారి స్పందించిన విజయ్.. “నా సమస్యలను నేనే చూసుకుంటా”
Vijay Deverakonda – Rashmika: తొలుత ఎవరు ప్రపోజ్ చేశారో తెలుసా? విజయ్ దేవరకొండ-రష్మిక మందాన లవ్ స్టోరీ
