HomeBusinessNetBlocks: 37 రోజులుగా ఇంటర్నెట్ నిలిపివేత.. ప్రపంచంలోనే సుదీర్ఘ డిజిటల్ షట్‌డౌన్

NetBlocks: 37 రోజులుగా ఇంటర్నెట్ నిలిపివేత.. ప్రపంచంలోనే సుదీర్ఘ డిజిటల్ షట్‌డౌన్

NetBlocks: ఈ రోజుల్లో యుద్ధాలు కేవలం సైనిక దాడులతో మాత్రమే జరగడం లేదు. సమాచార వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు కూడా యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇరాన్‌లో గత 37 రోజులుగా ఇంటర్నెట్ పూర్తిగా నిలిచిపోయింది. ప్రపంచ ఇంటర్నెట్ పర్యవేక్షక సంస్థ NetBlocks విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యంత సుదీర్ఘ జాతీయ స్థాయి ఇంటర్నెట్ షట్‌డౌన్గా నిలిచింది.

ఐదు వారాలుగా ప్రపంచంతో సంబంధాలు నిలిచిపోయిన ఇరాన్
నెట్‌బ్లాక్స్ వివరాల ప్రకారం ఇరాన్ ప్రభుత్వం ఫిబ్రవరి 28న ప్రపంచ ఇంటర్నెట్‌కు తన కనెక్షన్‌ను నిలిపివేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 864 గంటలకు పైగా దేశం ప్రపంచ డిజిటల్ నెట్‌వర్క్ నుండి పూర్తిగా వేరుపడింది.

ఇంత సుదీర్ఘ కాలం పాటు ఇంటర్నెట్ నిలిపివేయడం వల్ల దేశంలోని వ్యాపార కార్యకలాపాలు, విద్యా వ్యవస్థ, ఆరోగ్య సేవలు, బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.

ట్రైర్డ్ వైట్‌లిస్ట్ సిస్టమ్‌పై ఆలోచన
ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం “ట్రైర్డ్ వైట్ లిస్ట్ సిస్టమ్” అమలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఈ వ్యవస్థలో కొన్ని ప్రభుత్వ సంస్థలకు మాత్రమే ఇంటర్నెట్ యాక్సెస్, కొన్ని వ్యాపారాలకు పరిమిత యాక్సెస్, సాధారణ ప్రజలకు నియంత్రిత సేవలు అందించే విధంగా ఉండే అవకాశం ఉంది.

చరిత్రలో ప్రత్యేకమైన ఘటన
ప్రపంచవ్యాప్తంగా గతంలో కూడా అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ నిలిపివేతలు చోటుచేసుకున్నాయి. ఉదాహరణకు: మయన్మార్, సూడాన్, కాశ్మీర్, టిగ్రే ప్రాంతం ఇక్కడ ఇంటర్నెట్ సేవలు కొంతకాలం నిలిపివేయబడ్డాయి. అలాగే యుద్ధ పరిస్థితుల్లో ఉక్రెయిన్, గాజా వంటి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు ధ్వంసం కావడంతో ఇంటర్నెట్ ప్రభావితమైంది. కానీ ఇరాన్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఎలాంటి మౌలిక సదుపాయాలు దెబ్బతినకుండానే ప్రభుత్వం స్వయంగా దేశాన్ని ప్రపంచ ఇంటర్నెట్ నుంచి వేరు చేయడం ఇదే మొదటిసారి అని నెట్‌బ్లాక్స్ పేర్కొంది.

యుద్ధ ఉద్రిక్తతల మధ్య డిజిటల్ దిగ్బంధనం
ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై క్షిపణి, డ్రోన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ డిజిటల్ దిగ్బంధనం మరింత తీవ్రంగా మారింది. ఇరాన్ కూడా ప్రతిస్పందనగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

కుటుంబాలతో సంబంధాలు తెగిపోయిన ప్రజలు
ఇంటర్నెట్ లేకపోవడం వల్ల ఇరాన్‌లోని ప్రజలు తమ కుటుంబ సభ్యులు, బంధువులతో కూడా సంప్రదించలేకపోతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు అయిన శాటిలైట్ కనెక్షన్లు, VPN సేవలపై కూడా ప్రభుత్వం కట్టుదిట్టమైన నియంత్రణలు విధించినట్లు సమాచారం. దీంతో వేలాది కుటుంబాలు తమ ప్రియమైన వారి గురించి సమాచారం పొందలేక తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.

ఎప్పుడు పునరుద్ధరణ?
ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను పూర్తిగా పునరుద్ధరించే విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ డిజిటల్ దిగ్బంధనం ఎప్పుడు ముగుస్తుందో అనేది ఇంకా స్పష్టంగా లేదు. ఈ పరిస్థితుల్లో ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి దేశంలో ఉన్న సాధారణ ప్రజల జీవితం మరింత కష్టంగా మారుతోంది.

ఇవీ చ‌ద‌వండి: Iran War: మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు.. భారత్‌కు ఎలా ఉపశమనం? చ‌మురు విష‌యంలో స‌హాయం!
Iran Israel United States: ఇరాన్ షాకుల మీద షాకులు.. ఆయిల్ నౌక‌ల‌పై దాడులు.. పశ్చిమ ఆసియా యుద్ధం మరింత ఉద్రిక్తం..
Chiranjeevi, Prabhas: ఓటీటీ డీల్స్‌లో చిక్కుకున్న భారీ సినిమాలు.. చిరంజీవి, ప్రభాస్ మూవీస్‌కు రిలీజ్ టెన్షన్?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు