Banking: సైలెంట్ అథెంటిఫికేషన్ అనేది బ్యాంక్ లావాదేవీల సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే సెక్యూరిటీ వెరిఫికేషన్. ఇందులో ఓటీపీ అవసరం లేకుండానే మీ ఫోన్‌లో ఉన్న సిమ్, బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఒకటేనా అని ఆటోమేటిక్‌గా చెక్ చేస్తుంది.
సైబర్ మోసాలకు చెక్
ఇటీవల సిమ్ క్లోనింగ్, ఈ-సిమ్ స్వాపింగ్, ఓటీపీ దొంగతనం వంటి మోసాలు పెరుగుతున్నాయి. ఈ సమస్యలను తగ్గించడానికి సైలెంట్ అథెంటిఫికేషన్ ఉపయోగపడుతుంది. అనుమానాస్పద లావాదేవీలను సిస్టమ్ స్వయంగా బ్లాక్ చేస్తుంది.
ఓటీపీ అవసరం తగ్గే అవకాశం
ఈ కొత్త టెక్నాలజీ పూర్తిగా అమల్లోకి వస్తే ఓటీపీ ఆధారిత వెరిఫికేషన్ అవసరం తగ్గే అవకాశం ఉంది. దీంతో వినియోగదారులకు లావాదేవీలు మరింత వేగంగా, సురక్షితంగా జరుగుతాయి.
టెలికాం కంపెనీలతో ట్రయల్స్
బ్యాంకులు ప్రస్తుతం టెలికాం కంపెనీలతో కలిసి ఈ ఫీచర్‌పై ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. సిస్టమ్ సక్సెస్ అయితే దశలవారీగా బ్యాంకింగ్ యాప్‌ల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.
రెండు అంచెల భద్రత తప్పనిసరి
డిజిటల్ లావాదేవీల భద్రత కోసం ఏప్రిల్ 1 నుంచి రెండు అంచెల వెరిఫికేషన్ విధానాన్ని ఆర్బీఐ తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో సైలెంట్ అథెంటిఫికేషన్ వంటి కొత్త టెక్నాలజీలను బ్యాంకులు ప్రవేశపెడుతున్నాయి.
ఇవీ చదవండి: State Bank of India: లోన్లు మరింత సరళం.. ఒక్క మిస్డ్ కాల్‌తోనే రూ.50 లక్షల వరకూ పర్సనల్ లోన్!
Reserve Bank of India: లోన్లు తీసుకున్నోళ్లకు భారీ ఊరట: రికవరీ ఏజెంట్లపై ఆర్‌బీఐ కఠిన నిబంధనలు
Jobs in SBI : SBI ఉద్యోగాలు 2026 – Circle Based Officer పోస్టులకు భారీ నోటిఫికేషన్.. 2273 CBO పోస్టుల భర్తీకి State Bank of India అధికారిక ప్రకటన
