Ramayana Movie: ప్రస్తుతం సినిమాల రిలీజ్‌కు ముందు వచ్చే గ్లింప్స్, టీజర్లు, ట్రైలర్లు, పాటలు, క్యారెక్టర్ రివీల్ వీడియోలు సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. పెద్ద సినిమాలకు ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో ఉండాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
‘కల్కి’ తర్వాత పెరిగిన గ్రాండియర్ ప్రమోషన్స్
‘కల్కి’ సినిమా ప్రమోషన్స్ సమయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ భారీ స్థాయిలో ప్రచారం చేశారు. ఆ విధానాన్ని ఇప్పుడు మరికొన్ని పెద్ద సినిమాల మేకర్స్ కూడా అనుసరిస్తున్నారు.
మహేష్‌బాబు పాత్రపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి
వారణాసిలో జరిగిన గ్లోబ్ ట్రాట్ ఈవెంట్‌లో మహేష్‌బాబు పాత్రపై భారీ ఆసక్తి కనిపించింది. మహేష్‌బాబు ఎలా కనిపిస్తారు, గ్లోబ్ ట్రాటర్, టైమ్ ట్రాటర్‌గా ఎలా మెప్పిస్తారన్నది అభిమానుల్లో చర్చగా మారింది.
రెండు నిమిషాల 38 సెకన్ల టీజర్ రెడీ
‘రామాయణ’ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే సిద్ధమైంది. సుమారు 2 నిమిషాల 38 సెకన్ల నిడివితో రూపొందించిన ఈ టీజర్‌ను హిందీ, ఇంగ్లీష్‌తో పాటు పలు భారతీయ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మైండ్ బ్లోయింగ్ విజువల్స్ అంటూ టాక్
ఇటీవల లాస్ ఏంజెల్స్‌లో కొద్ది మంది సభ్యులకు టీజర్ ప్రొజెక్షన్ చూపించగా, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని టాక్ వచ్చింది. దీంతో అభిమానులు ఈ టీజర్‌ను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవీ చదవండి: Ramayana Movie: భారీ అంచనాల్లో ‘రామాయణ’.. ఏప్రిల్ 2న ‘రామ’ గ్లింప్స్ రిలీజ్
Ontimitta Kodandarama Temple: ఒంటిమిట్ట కోదండరామ ఆలయంలో పౌర్ణమినాడే కల్యాణం ఎందుకు?
Sai Pallavi: సూపర్ ఫామ్‌లో సాయి పల్లవి.. నార్త్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసి తిరిగి సౌత్‌పై ఫోకస్
