Ajith Kumar: కోలీవుడ్ స్టార్ హీరో Ajith Kumar మరోసారి అభిమానులను ఆకట్టుకున్నారు. సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన ఆయన ప్రస్తుతం మోటార్‌స్పోర్ట్స్‌పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అజిత్ అక్కడ బిర్యానీ వండుతూ కనిపించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎఫ్‌సీ మద్రాస్ ఈవెంట్‌లో అజిత్
చెన్నైకి చెందిన ఫుట్‌బాల్ క్లబ్ FC Madras నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి అజిత్ కుమార్ తన భార్య Shalini Ajith Kumarతో కలిసి హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో అభిమానులతో కలసి సరదాగా గడిపిన అజిత్, అక్కడే బిర్యానీ వండుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు.
భార్య షాలిని సరదా కామెంట్స్
ఈ సందర్భంగా షాలిని తన భర్తను సరదాగా ఆటపట్టించారు. “నేను చెప్పినట్టుగా చేశావా?” అంటూ నవ్వుతూ అడిగిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ దంపతుల సరదా సంభాషణ అభిమానులను మరింత ఆకట్టుకుంది.
అజిత్‌పై ఎఫ్‌సీ మద్రాస్ ప్రశంసలు
ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అజిత్ దంపతులకు ఎఫ్‌సీ మద్రాస్ కృతజ్ఞతలు తెలిపింది. భారతదేశంలో మోటార్‌స్పోర్ట్స్ అభివృద్ధికి అజిత్ చూపిస్తున్న దార్శనికత నిజంగా స్ఫూర్తిదాయకమని పేర్కొంది. క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ యువ క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఆయనతో కలిసి పనిచేయాలని క్లబ్ తెలిపింది.
సినిమాలకు బ్రేక్.. రేసింగ్‌లో బిజీ
ఇటీవల కాలంలో అజిత్ సినిమాల కంటే కార్ రేసింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా అంతర్జాతీయ స్థాయి మోటార్ రేసింగ్ పోటీల్లో పాల్గొంటూ తన ఆసక్తిని కొనసాగిస్తున్నారు.
కొత్త సినిమా ఎప్పుడు?
అజిత్ కుమార్ త్వరలోనే దర్శకుడు Adhik Ravichandranతో మరో కొత్త సినిమా చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరిలో ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: Virajitha: హీరోయిన్ కాదు.. కానీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్.. విశాఖ అమ్మాయి హవా చూశారా?
Vijay Assets: తమిళనాడు ఎన్నికలు: టీవీకే చీఫ్ విజయ్ ఆస్తుల వివరాలు వెల్లడి.. రూ.400 కోట్లకు పైగా సంపద
TVK Vijay: డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్.. వేదికపై భావోద్వేగ క్షణాలు
