HomeSportsVaibhav Sooryavanshi: ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ సంచలనం.. 15 బంతుల్లో ఫిఫ్టీతో రికార్డుల వర్షం

Vaibhav Sooryavanshi: ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ సంచలనం.. 15 బంతుల్లో ఫిఫ్టీతో రికార్డుల వర్షం

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తన ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న ఈ 15 ఏళ్ల కుర్రాడు చెన్నై సూపర్ కింగ్స్‌పై కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డులను నమోదు చేశాడు.

1. 15 బంతుల్లో హాఫ్ సెంచరీ
గువాహటి వేదికగా జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి ఈ సీజన్‌లోనే అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ నమోదు చేశాడు.

2. 17 బంతుల్లో 52 పరుగులు
వైభవ్ మొత్తం 17 బంతుల్లో 52 పరుగులు చేసి 5 సిక్సర్లు బాదాడు. చిన్న వయసులోనే అతని పవర్ హిట్టింగ్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

3. 8 మ్యాచ్‌ల్లోనే 29 సిక్సర్లు
ఇప్పటివరకు కేవలం 8 ఐపీఎల్ మ్యాచ్‌ల్లోనే వైభవ్ 29 సిక్సర్లు బాది సంచలనం సృష్టించాడు. ఇది అనుభవజ్ఞులైన ఆటగాళ్ల రికార్డులకు సమానంగా ఉండటం విశేషం.

4. సచిన్ రికార్డుతో సమానం
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన ఐపీఎల్ కెరీర్ మొత్తం (78 మ్యాచ్‌లు)లో 29 సిక్సర్లు కొట్టగా, వైభవ్ కేవలం 8 మ్యాచ్‌ల్లోనే ఆ రికార్డును సమం చేశాడు.

5. ధోనీ లేక చెన్నై పరాజయం
ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ ప్లేయింగ్-11లో లేకపోవడం చెన్నైకు ప్రతికూలంగా మారింది. ధోనీ లేకుండా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో వరుసగా ఓటములు చవిచూసిన చెన్నైకి ఇది మరో నిరాశగా మారింది.

ఇవీ చ‌ద‌వండి: MS Dhoni: CSKకు భారీ షాక్: ఐపీఎల్ 2026 సీజన్‌లో మొదటి రెండు వారాలు ఎంఎస్ ధోని దూరం! కాల్ఫ్ స్ట్రెయిన్‌తో రిహాబ్‌లో థలా
MS Dhoni: బుడ్డోడు వ‌ర్సెస్ పెద్దోడు.. ధోని సేన‌కు స‌వాల్ విసిరిన వైభవ్ సూర్యవంశీ.. 4-0 చేస్తామని ధీమా

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు