Ration Card New Rules: రేషన్ కార్డు ద్వారా లక్షలాది కుటుంబాలు ప్రభుత్వ సబ్సిడీ ఆహార ధాన్యాలను పొందుతున్నాయి. అయితే రేషన్ పంపిణీలో పారదర్శకత పెంచడం మరియు అనర్హులను తొలగించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2026 నుంచి కొన్ని కొత్త నిబంధనలను అమలు చేయనుంది. ఈ నిబంధనల ప్రకారం కార్డు ఉన్నవారు, కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు కొన్ని విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.
1. e-KYC తప్పనిసరి
ఇకపై రేషన్ కార్డులో ఉన్న ప్రతి సభ్యుడు e-KYC పూర్తి చేయడం తప్పనిసరి.
దీనిని సమీప రేషన్ షాపులో బయోమెట్రిక్ ద్వారా లేదా ‘మేరా రేషన్’ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ద్వారా పూర్తి చేయవచ్చు.
నిర్దిష్ట గడువులో e-KYC చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి రేషన్ సరఫరా నిలిపివేయబడే అవకాశం ఉంది.
2. ఆదాయ పరిమితిలో మార్పులు
కొత్త రేషన్ కార్డు దరఖాస్తుదారులకు వార్షిక ఆదాయ పరిమితిని కొన్ని రాష్ట్రాల్లో పెంచారు. ఉదాహరణకు ఢిల్లీలో ఆదాయ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.1.20 లక్షలకు పెంచారు.
అలాగే 18 ఏళ్లు పైబడిన మహిళను కుటుంబ పెద్దగా పరిగణించే నిబంధన కూడా అమలులోకి వస్తోంది.
3. పూర్తిగా ఆన్‌లైన్ ప్రక్రియ
కొత్త రేషన్ కార్డు కోసం ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది.
దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు:
ఆధార్ కార్డులు
ఆదాయ ధృవీకరణ పత్రం
నివాస ధృవీకరణ (కరెంటు బిల్లు మొదలైనవి)
దరఖాస్తు చేసిన తర్వాత ఫుడ్ సప్లై ఆఫీసర్ (FSO) ఇంటికి వచ్చి వివరాలను ధృవీకరించిన తర్వాతే రేషన్ కార్డు జారీ చేస్తారు.
4. ఒకేసారి మూడు నెలల రేషన్
కొన్ని రాష్ట్రాల్లో లబ్ధిదారుల సౌకర్యార్థం ఒకేసారి మూడు నెలల రేషన్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో ప్రతి నెలా రేషన్ షాపుల వద్ద క్యూలలో నిలబడాల్సిన అవసరం తగ్గుతుంది.
5. ఈ పరిస్థితుల్లో రేషన్ కార్డు రద్దు
కొత్త నిబంధనల ప్రకారం కొన్ని పరిస్థితుల్లో రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం ఉంటుంది.
కుటుంబంలో ఎవరైనా ఇంకమ్ ట్యాక్స్ చెల్లిస్తే
నాలుగు చక్రాల వాహనం (ట్రాక్టర్ మినహా) ఉంటే
వరుసగా మూడు నెలలు రేషన్ తీసుకోకపోతే
కుటుంబ సభ్యుల మరణం లేదా వివాహం జరిగినా పేర్లు తొలగించకపోతే
ఈ నిబంధనల వల్ల నిజంగా అవసరం ఉన్న వారికి మాత్రమే రేషన్ అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
ఇవీ చదవండి: Ration Cards: రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వ శుభవార్త..
Free Ration Big Update: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. మూడు నెలల రేషన్ ఒకేసారి.. కేంద్రం కీలక నిర్ణయం
Free Ration Big Update: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. మూడు నెలల రేషన్ ఒకేసారి.. కేంద్రం కీలక నిర్ణయం
Ration Cards: కొత్త రేషన్ కార్డులపై ఏపీ సర్కార్ కీలక సూచనలు
