Ration Cards: కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఈ -కేవైసీ కోసం కొత్త రేషన్ కార్డుల జారీ ఆలస్యమైందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) తెలిపారు. రేపటి నుంచి రేషన్ కార్డుల (Ration Cards) దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు.
కొత్త కార్డులు, మార్పులు- చేర్పులు, చిరునామా మార్చుకోవచ్చని మంత్రి సూచించారు. రేషన్ కార్డు మార్పు కోసం 3.28 లక్షల దరఖాస్తులు వచ్చాయని మంత్రి తెలిపారు. క్యూఆర్ కోడ్ తో స్మార్ట్ రేషన్ కార్డు జారీ చేస్తామన్నారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే 6 నెలల రేషన్ వివరాలు తెలుస్తాయన్నారు.
స్మార్ట్ కార్డులో కుటుంబసభ్యుల పేర్లు స్పష్టంగా కనిపిస్తాయన్నారు. స్మార్ట్ కార్డుతో దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు ఉంటుందని మంత్రి నాదెండ్ల తెలిపారు. రేషన్ కార్డు కోసం నెలపాటు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 4.24 కోట్ల మందికి స్మార్ట్ కార్డు జారీ చేస్తామన్నారు. వచ్చే నెల నుంచే స్మార్ట్ కార్డులు జారీ ప్రక్రియ ఉంటుందన్నారు. ప్రస్తుతం 95శాతం ఈ -కేవైసీ పూర్తయ్యిందని మంత్రి తెలిపారు. ఈ -కేవైసీ పూర్తయినవారు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని మంత్రి క్లారిటీ ఇచ్చారు.
ఇవీ చదవండి: Apar Generation: అపార్ జనరేషన్ కరెక్షన్స్‌కు 2025 మార్చి 31 వరకు గడువు
Registrations AP: గ్రామ సచివాలయాల్లో పంచాయతీ సెక్రటరీలకు రిజిస్ట్రేషన్ అధికారాలు
