Monalisa: ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అయి ఒక్కసారిగా పాపులర్ అయిన మోనాలిసా భోంస్లే ఇటీవలే ప్రేమ వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది. కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్న ఆమె తాజాగా మరో వివాదంతో బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.
దర్శకుడిపై సంచలన ఆరోపణలు
తనకు మొదటి సినిమా అవకాశం ఇచ్చిన బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రాపై మోనాలిసా సంచలన ఆరోపణలు చేసింది. షూటింగ్ సమయంలో సనోజ్ మిశ్రా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, షూటింగ్ పేరుతో పలుమార్లు తన శరీరాన్ని తాకుతూ ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పినా పెద్దగా పట్టించుకోలేదని ఆమె పేర్కొంది.
ఆరోపణలను ఖండించిన సనోజ్ మిశ్రా
మోనాలిసా చేసిన ఆరోపణలను దర్శకుడు సనోజ్ మిశ్రా పూర్తిగా ఖండించారు. తాను ఆమెకు అండగా నిలబడి నటన కూడా నేర్పించానని తెలిపారు. ఫర్మాన్ ఖాన్‌తో వెళ్లిపోవడాన్ని తాను వ్యతిరేకించడంతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అంతేకాదు, మోనాలిసా కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఉజ్జయినిలోని తన ఇంట్లోనే ఉంటున్నారని వెల్లడించారు.
పెళ్లి వివాదమే కారణమా..?
మోనాలిసా పెళ్లిని ఆమె తల్లిదండ్రులు కూడా వ్యతిరేకించారని సనోజ్ మిశ్రా చెప్పారు. ఈ వివాహం చెల్లదని కుటుంబ సభ్యులు ప్రకటించారని పేర్కొన్నారు. తాను కూడా ఈ పెళ్లికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే తనపై ఆరోపణలు వచ్చాయని తెలిపారు.
పరువు నష్టం దావా వేస్తానన్న దర్శకుడు
మోనాలిసాపై త్వరలోనే పరువు నష్టం దావా వేయనున్నట్లు సనోజ్ మిశ్రా వెల్లడించారు. ఒకటి రెండు రోజుల్లో కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. తన మాటల్లో నిజం లేకపోతే ఆమె కూడా న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చని అన్నారు.
సినిమా భవిష్యత్‌పై సందేహాలు
ఇక సనోజ్ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ సినిమాలో మోనాలిసా ప్రధాన పాత్రలో నటిస్తోంది. అయితే ప్రస్తుతం ఏర్పడిన వివాదాల నేపథ్యంలో ఈ సినిమా నిర్మాణం కొనసాగుతుందా లేదా అన్నది అనుమానంగా మారింది.
ఇవీ చదవండి: Monalisa: దర్శకుడు సనోజ్ మిశ్రాపై మోనాలిసా సంచలన ఆరోపణలు.. షూటింగ్ సమయంలో తాకేవాడని ఆరోపణ
Monalisa: డబ్బు కోసం అలాంటి మూవీస్ లో యాక్ట్ చేశానన్న నటి.. సంచలన వ్యాఖ్యలు
Monalisa Bhosle: కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా భోస్లే వివాహం.. కుటుంబాల వ్యతిరేకత మధ్య ఆలయంలో పెళ్లి
