APPSC Group-2 Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మొత్తం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులను మొత్తం 41 నోటిఫికేషన్ల రూపంలో నాలుగు విడతల్లో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీఎస్సీ, పోలీసు నియామకాలు మినహా మిగతా చాలా పోస్టులను ఏపీపీఎస్సీ (APPSC) ద్వారానే భర్తీ చేయనున్నారు.
గ్రూప్-2 పోస్టులు ఎన్ని?
ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం APPSC ద్వారా దాదాపు 750 వరకు గ్రూప్-2 పోస్టులు భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను సెప్టెంబర్ 15, 2026న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే గ్రూప్-1 నోటిఫికేషన్‌ను ఆగస్ట్ 15న విడుదల చేయనున్నారు. ముందుగానే తేదీలు ప్రకటించడం వల్ల అభ్యర్థులు తమ సిద్ధతను ప్రణాళిక ప్రకారం కొనసాగించేందుకు అవకాశం లభిస్తుంది.
ఇతర శాఖల్లో కూడా భారీ పోస్టులు
APPSC ఆధ్వర్యంలో పలు శాఖల్లో కూడా పోస్టులు భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా:
హోంశాఖలో – 2,778 పోస్టులు
సంక్షేమ శాఖ – 259 పోస్టులు
అటవీ శాఖ – 140 పోస్టులు
ప్లానింగ్ శాఖ – 268 పోస్టులు
అగ్రికల్చర్ శాఖ – 105 పోస్టులు
పరిశ్రమల శాఖ – 95 పోస్టులు
కార్మికశాఖ – 12 పోస్టులు
జువెనైల్ శాఖ – 49 పోస్టులు
ఇవికాకుండా
ఇంజినీర్ పోస్టులు – 503
ఎక్సైజ్ శాఖ – 409
ఏఎంవీఐ – 50 పోస్టులు
గనుల శాఖ – 47 పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు.
డీఎస్సీ, ఇతర నియామకాలు
అలాగే విద్యాశాఖలో 1,535 టీచర్ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ను అక్టోబర్ 15న విడుదల చేయనున్నారు. అదేవిధంగా ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మే 15న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
నైపుణ్య పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు ముందుగా నైపుణ్య పోర్టల్ (Naipunyam Portal) లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆధార్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ద్వారా లాగిన్ అయి తమ వివరాలు నమోదు చేయాలి.
ఈ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర, ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం కూడా అభ్యర్థులకు అందుతుంది.
ఇవీ చదవండి: Andhra Pradesh Job Calender: ఉగాది కానుకగా ‘జాబ్ క్యాలెండర్-2026’ విడుదల
Railway Jobs 2026: రైల్వేలో 2,801 అప్రెంటిస్ పోస్టులు.. పరీక్ష లేకుండానే ఎంపిక, వెంటనే దరఖాస్తు చేయండి
Jobs in NIC : నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్‌లో 376 ఉద్యోగాలు.. సైంటిఫిక్ & టెక్నికల్ అసిస్టెంట్-A పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ – GATE అర్హత తప్పనిసరి
