HomeAstrologySri Rama Navami 2026: పండుగ స్పెషల్ స్వీట్.. పెసరపప్పు హ‌ల్వా ఇలా చేస్తే రుచి...

Sri Rama Navami 2026: పండుగ స్పెషల్ స్వీట్.. పెసరపప్పు హ‌ల్వా ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది

Sri Rama Navami 2026: శ్రీరామనవమి పండుగ రోజున ఇంట్లో ప్రత్యేకంగా స్వీట్లు తయారు చేసి దేవుడికి నైవేద్యం పెట్టడం సంప్రదాయం. ఈ సందర్భంలో సులభంగా తయారుచేసే పెసరపప్పు హ‌ల్వా మంచి రుచితో పాటు ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. కొన్ని సింపుల్ స్టెప్స్ పాటిస్తే ఈ స్వీట్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.

పెసరపప్పు నానబెట్టడం
ఒక కప్పు పెసరపప్పును బాగా కడిగి సుమారు మూడు గంటల పాటు నానబెట్టాలి. తర్వాత నీళ్లు వడపోసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.

నెయ్యిలో వేయించడం
పాన్‌లో 5 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి వేడి అయ్యాక రుబ్బుకున్న పెసరపప్పును వేసి మీడియం మంటపై రంగు మారే వరకు బాగా వేయించాలి.

పాలు కలిపి ఉడికించడం
వేయించిన పప్పులో కప్పున్నర పాలు పోసి ముద్దలు పడకుండా కలుపుతూ బాగా ఉడికించాలి. పప్పు మెత్తగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి.

పంచదార వేసి హ‌ల్వా తయారు
పప్పు మెత్తగా అయిన తర్వాత ఒక కప్పు పంచదార వేసి బాగా కలపాలి. పంచదార కరిగిన తర్వాత మిశ్రమం హ‌ల్వా లా గట్టిగా మారుతుంది.

డ్రై ఫ్రూట్స్‌తో టేస్ట్ పెంపు
వేరే పాన్‌లో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్, బాదం వేయించి హాల్వాలో కలపాలి. చివరగా యాలకుల పొడి వేస్తే సువాసనతో పాటు రుచి మరింత పెరుగుతుంది.

ఇవీ చ‌ద‌వండి: Sri Rama Navami Marriage Solution: శ్రీ‌రామన‌వ‌మి రోజు ఇలా చేస్తే పెళ్లి యోగం ఖాయం?
Simhachalam Sri Varaha Lakshmi Narasimha Swamy Temple: సింహాచలం అప్ప‌న్న భ‌క్తుల‌కు గుడ్ న్యూస్.. డిజిటల్ సేవలు ప్రారంభం.. కియోస్క్‌లతో క్షణాల్లో దర్శన టికెట్లు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు