HomeSportsIPL 2026: ఐపీఎల్ పోరుకు రెడీ.. వరల్డ్ కప్ హీరోలు తమ పాత జట్లలోనే

IPL 2026: ఐపీఎల్ పోరుకు రెడీ.. వరల్డ్ కప్ హీరోలు తమ పాత జట్లలోనే

IPL 2026: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారీ విజయం సాధించి భారత్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మూడు వారాలకే ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

భారత్ వరల్డ్ కప్ విజేత జట్టులో ఉన్న 15 మంది ఆటగాళ్లలో దాదాపు అందరూ తమ పాత ఐపీఎల్ జట్లలోనే కొనసాగుతున్నారు. ముంబై ఇండియన్స్ తరపున సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా ఆడనుండగా, కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి బరిలోకి దిగనున్నారు.

చెన్నైకి మారిన సంజూ శాంసన్
ఈ సీజన్‌లో పెద్ద మార్పు సంజూ శాంసన్ జట్టు మార్పు. ఆయన రాజస్థాన్ రాయల్స్‌ను వదిలి చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరారు. భారీ ట్రేడ్ డీల్‌లో భాగంగా రవీంద్ర జడేజా, సామ్ కరన్ రాజస్థాన్ జట్టులోకి వెళ్లారు. ధోనీ తర్వాత చెన్నైకి నాయకత్వం వహించే అవకాశాలు సంజూకు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు.

వరల్డ్ కప్ విజేతలే కెప్టెన్లు
ఈసారి ఐపీఎల్‌లో ముగ్గురు వరల్డ్ కప్ విజేతలు కెప్టెన్లుగా కనిపించనున్నారు. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు, అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహిస్తుండగా, పాట్ కమిన్స్ గాయం కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ బాధ్యతలు చేపట్టనున్నారు.

తొలి మ్యాచ్ నుంచే వరల్డ్ కప్ హీరోల పోరు
ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లోనే వరల్డ్ కప్ హీరోలు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున బరిలోకి దిగనున్నారు. మరోవైపు ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లీ కూడా ఉండటంతో తొలి మ్యాచ్ నుంచే అభిమానులకు భారీ ఎంటర్‌టైన్‌మెంట్ అందనుంది.

ఇవీ చ‌ద‌వండి: IPL 2026: కోహ్లీ రికార్డ్ డేంజ‌ర్‌లో ఉందా? ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు ఎవరు బద్దలు కొడతారు?
IPL 2026: చివరి ఓవర్లలో మ్యాచ్ మలుపుతిప్పే ఫినిషర్లు ఎవరు? ధోని నుంచి రింకూ దాకా!
IPL 2026: వర్షం అడ్డంకి? మ్యాచ్ రూల్స్ ఇవే! వాతావరణ హెచ్చరికలు – మ్యాచ్‌లపై ప్రభావం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు