Rasha Thadani: ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న తాజా చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రషా తడానీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది.
ఈ చిత్రంలో రషా ‘మంగ’ అనే పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ‘ఉయి అమ్మ’ పాటతో రషా తన అందం, ఎనర్జీతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ సాంగ్ సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకుంది.
ఇవాళ రషా తడానీ పుట్టినరోజు సందర్భంగా మూవీ మేకర్స్ ప్రత్యేకంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సినిమా సెట్స్‌లో రషా నటన, హావభావాలతో కూడిన వీడియోను విడుదల చేశారు. టీమ్ సభ్యులందరూ కలిసి ఆమెకు బర్త్‌డే విషెస్ చెప్పిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు మోహన్ బాబు ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ‘చందమామ కథలు’ బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు అడుగుపెడుతున్న రషా తడానీ ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటుందో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవీ చదవండి: Deewana Movie Teaser: తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ‘దీవానా’.. యూట్యూబ్‌లో దూసుకుపోతున్న టీజర్
Rashi Singh: రాశి సింగ్ హాట్ ఫొటో గ్యాలరీ.. భూతద్దం భాస్కర్ నారాయణ బ్యూటీ కలర్‌ఫుల్ పిక్స్!!
Rashi Khanna: బ్లాక్ డ్రెస్‌లో అందాల రాశి.. లేటెస్ట్ హాట్ ఫొటోషూట్ వైరల్!
Raashii Khanna: ‘తెలుసు కదా’ ఫ్లాప్ ముందే ఊహించా.. రాశీ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు
