NEET MDS 2026: దేశవ్యాప్తంగా డెంటల్ మెడికల్ కాలేజీల్లో మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (MDS) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ ఎండీఎస్ 2026 (NEET MDS 2026) నోటిఫికేషన్‌ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) విడుదల చేసింది.
ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ డెంటల్ కాలేజీలు మరియు యూనివర్సిటీలలోని పలు స్పెషలైజేషన్‌లలో అభ్యర్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎండీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు
నీట్ ఎండీఎస్ 2026లో సాధించిన ర్యాంక్ ఆధారంగా వివిధ స్పెషలైజేషన్‌లలో అడ్మిషన్లు కల్పిస్తారు. ముఖ్యంగా ఈ కోర్సుల్లో ప్రవేశాలు ఉంటాయి:
ఓరల్ అండ్ మాక్సిల్లోఫేషియల్ సర్జరీ
కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడొంటిక్స్
ఆర్థోడాంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్
ప్రోస్టోడాంటిక్స్
పీరియాడాంటాలజీ
ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ
పెడోడాంటిక్స్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్రీ
పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ
ఓరల్ పాథాలజీ
దేశవ్యాప్తంగా ఉన్న డెంటల్ కాలేజీల్లో ఈ స్పెషలైజేషన్‌లకు అభ్యర్థులు ప్రవేశాలు పొందవచ్చు.
అర్హతలు
నీట్ ఎండీఎస్ 2026 పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు కొన్ని అర్హతలు తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (BDS) డిగ్రీలో ఉత్తీర్ణత పొందాలి.
12 నెలల రొటేటరీ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి.
ప్రస్తుతం ఇంటర్న్‌షిప్ చేస్తున్న అభ్యర్థులు మే 31, 2026లోపు పూర్తి చేయాలి.
సంబంధిత స్టేట్ డెంటల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ ఉండాలి.
దరఖాస్తు విధానం
అభ్యర్థులు మార్చి 14, 2026 నుంచి మార్చి 30, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అప్లికేషన్ ఫారం సమర్పించాలి.
పరీక్ష విధానం
నీట్ ఎండీఎస్ 2026 పరీక్షను మే 2, 2026న దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షను NBEMS ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. పరీక్షలో సాధించిన ర్యాంక్ ఆధారంగా దేశంలోని వివిధ డెంటల్ కాలేజీల్లో ఎండీఎస్ కోర్సుల్లో అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తారు.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: మార్చి 14, 2026
దరఖాస్తు చివరి తేదీ: మార్చి 30, 2026
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: ఏప్రిల్ 29, 2026
నీట్ ఎండీఎస్ పరీక్ష: మే 2, 2026
ఫలితాలు: జూన్ 2, 2026లోపు విడుదల
విద్యార్థులకు సూచనలు
ఎండీఎస్‌లో ప్రవేశాలు కోరుకునే అభ్యర్థులు ముందుగానే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పరీక్ష సిలబస్, గత సంవత్సర ప్రశ్నాపత్రాలను పరిశీలించి సమగ్రంగా సిద్ధమైతే మంచి ర్యాంక్ సాధించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ఇవీ చదవండి: NEET PG 2025 Counselling: సుప్రీంకోర్టు విచారణ వాయిదా.. అభ్యర్థుల్లో గందరగోళం
JEE NEET: ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త.. విశాఖలో నీట్ జేఈఈ శిక్షణ కేంద్రం
OTT Movies: ఓటీటీలోకి సైలెంట్‌గా అనుపమ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చు?
