NEET PG 2025 Counselling: NEET PG 2025 కౌన్సెలింగ్‌పై మరింత ఆలస్యం తలెత్తింది. పరీక్షా ప్రక్రియలో పారదర్శకతకు సంబంధించిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. దీంతో ఇప్పటికే ఎదురుచూస్తున్న వేలాది మంది మెడికల్ అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. (NEET PG 2025 Counselling)
అసలైన షెడ్యూల్ ప్రకారం ఈ కేసు అక్టోబర్‌లో విచారణకు రావాల్సి ఉంది. కానీ కౌన్సెలింగ్ ఆలస్యం, విధానపరమైన స్పష్టత లేకపోవడం వల్ల సెప్టెంబర్ 4న, ఆపై సెప్టెంబర్ 12న విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. అయితే పరీక్ష పారదర్శకతపై ఇంకా సందేహాలు తొలగకపోవడంతో, విచారణను మరో రెండు వారాలు వాయిదా వేసినట్లు ప్రకటించింది.
వివరాల్లోకి వెళితే…
ఆగస్టు 21న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) జారీ చేసిన ఒక దిద్దుబాటు నోటీసును సవాలు చేస్తూ కొంతమంది అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మొదట NBEMS పూర్తి ప్రశ్న పత్రం, అధికారిక సమాధాన కీ విడుదల చేస్తామని హామీ ఇచ్చినా, చివరికి కేవలం ప్రశ్న ID నంబర్లు మాత్రమే ప్రకటించింది.
దీంతో అభ్యర్థులు తమ సమాధానాలు సరైనవో కాదో ధృవీకరించుకోవడంలో అవరోధాలు ఏర్పడ్డాయని, ఇది పరీక్షా ప్రక్రియలో పారదర్శకత లేకపోవడానికి నిదర్శనమని వాదించారు. “మా పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయమని కాదు, కేవలం ప్రశ్నలు, సమాధానాలు, కేటాయించిన మార్కులు స్పష్టంగా వెల్లడించాలన్నదే మా డిమాండ్” అని వారు పేర్కొన్నారు.
ఇక సుప్రీంకోర్టు విచారణ వాయిదా కారణంగా NEET PG 2025 కౌన్సెలింగ్, అడ్మిషన్ షెడ్యూల్‌పై మరింత అనిశ్చితి ఏర్పడింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, దేశంలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో పారదర్శకత, సమయపాలన రెండూ కాపాడాలంటే త్వరితగతిన స్పష్టమైన తీర్పు అవసరం.
ఇవీ చదవండి: JEE NEET: ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త.. విశాఖలో నీట్ జేఈఈ శిక్షణ కేంద్రం
Women Dress : ఛామనఛాయ యువతులకు ఎలాంటి డ్రెస్‌లు బాగుంటాయి?
